కేరళ : కేరళ ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు. గంపగుత్తగా యుడీఎఫ్ కు విజయాన్ని కట్టబెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే కేరళం విజయం సాధించింది. ఎవరూ ఊహించని గెలుపు. UDFకి అనుకూలంగా చారిత్రాత్మకమైన, రికార్డు స్థాయి తీర్పునిచ్చి, ఏకంగా 102 స్థానాలను కట్టబెట్టిన కేరళంలోని 3 కోట్ల మంది ప్రజలకు తాము కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామని ప్రకటించారు యుడీఎఫ్ నేతలు కేసీ వేణుగోపాల్, తదితరులు. ఎర్రకోటలు బీటలు వారాయి. నిరంకుశ విధానాలకు జనం ఛీ కొట్టారు. అంతే కాదు సంప్రదాయ రాజకీయ సమీకరణాలు తిరస్కరించ బడ్డాయి, కేరళం అంతటా ఒక UDF పవనం వీచింది!
ఇది కేరళ సామాన్య ప్రజల విజయం . యువత, మహిళలు, రైతులు, వర్గం, కులం, ప్రాంతం వంటి విభేదాలకు అతీతంగా ఉన్న సామాన్యులందరూ UDFపై తమ విశ్వాసాన్ని ఉంచారు. ఇది INC అధ్యక్షుడు మల్లికార్జున్ మార్గదర్శకత్వం లోనూ, ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ చైతన్య వంతమైన నాయకత్వంలోనూ సాగిన ఐక్య పోరాట విజయం అని పేర్కొన్నారు కేసీ వేణుగోపాల్. ప్రజల మాట వినే, ప్రజల పక్షాన నిలిచే, సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వాన్ని మేము తిరిగి తీసుకు వస్తామని ప్రకటించారు. ఇక్కడ విశ్వాసం రక్షించ బడుతుంది, ప్రతి మలయాళీకి వారు అర్హులైన గౌరవం, న్యాయం లభిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రజలు మాపై ఉంచిన ఈ భారీ బాధ్యతను నెరవేర్చడానికి, కేరళాన్ని తీర్చిదిద్దే క్రమంలో వారి అంచనాలకు మించి పని చేయడానికి మేము మా శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు.
















