కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ అరుదైన రికార్డ్

టి20 ఫార్మాట్ లో 8000 ర‌న్స్ పూర్తి

hellotelugu-SanjuSamsonRecord

కేర‌ళ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన టి20 మ్యాచ్ లో తన కెరీర్ లో 8,000 ర‌న్స్ పూర్తి చేశాడు. ఏడ‌వ‌ భార‌తీయ క్రికెట‌ర్ గా స్థానం పొందాడు. అంతే కాదు ఇండియ‌న్ క్రికెట్ హిస్ట‌రీలో అత్యంత వేగంగా 1,000 ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ల‌లో త‌ను మూడో వ్య‌క్తి కావ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు టి20 ఫార్మాట్ లో ఇండియా త‌ర‌పున ఆడిన ఆట‌గాళ్ల‌లో ఎనిమిది వేల ప‌రుగులు చేసిన వారిలో త‌ను కూడా స్థానం సంపాదించడం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది . గ‌తంలో స్టార్ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, సూర్య కుమార్ యాద‌వ్, శిఖ‌ర్ ధావ‌న్ , సురేష్ రైనా, కేఎల్ రాహుల్ లు ఈ ఘ‌న‌త సాధించారు. అంతే కాదు టి20 ల‌లో 1,000 ప‌రుగులు చేసిన 14వ భారతీయ బ్యాట‌ర్ గా నిలిచాడు. మార్కో జాన్స‌న్ బౌలింగ్ లో భారీ సిక్స్ కొట్ట‌డంతో ఈ ఘ‌న‌త సాధ్య‌మైంది.

ఇక ఆట‌గాళ్ల వ్య‌క్తిగ‌త ప‌ర్ ఫార్మెన్స్ చూస్తే విరాట్ కోహ్లీ 414 మ్యాచ్ లు ఆడి 13,543 ర‌న్స్ చేయ‌గా రోహిత్ శ‌ర్మ 463 మ్యాచ్ లు ఆడి 12,248 ప‌రుగులు చేశాడు. శిఖ‌ర్ ధావ‌న్ 334 మ్యాచ్ లు ఆడి 9,797 ర‌న్స్ చేస్తే , సూర్య కుమార్ యాద‌వ్ 345 మ్యాచ్ లు ఆడి 8,970 ప‌రుగులు చేయ‌గా, సురేష్ రైనా 336 మ్యాచ్ లు ఆడి 8,654 ర‌న్స్ చేశాడు. కేఎల్ రాహుల్ 239 మ్యాచ్ లు ఆడి 8,125 ర‌న్స్ చేయ‌గా , సంజూ శాంస‌న్ 319 మ్యాచ్ లు ఆడి 8 వేలు పూర్తి చేశాడు. అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకోవ‌డంతో త‌న‌ను బీసీసీఐ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఎంపిక చేసింది. మొత్తంగా అరుదైన ఘ‌నత సాధించ‌డం ప‌ట్ల త‌న ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Exit mobile version