Kerala High Court : కేరళ : ప్రముఖ వివాదాస్పద అంతర్జాతీయ రచయిత్రి అరుంధతీ రాయ్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. సోమవారం కేరళ హైకోర్టు (Kerala High Court) కీలక తీర్పు వెలువరించింది. తాను ఇటీవల పుస్తకాన్ని ప్రచురించింది. ఇది కలకలం రేపింది. దానికి ప్రధాన కారణం పుస్తకంపై తాను సిగరెట్ తాగుతున్న ఫోటోను ప్రచురించింది. దీంతో తమ మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని కేరళ హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం కింద దావా దాఖలైంది. సోమవారం ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది ధర్మాసనం. అరుంధతి రాయ్ పొగ తాగుతున్నట్లు చూపిస్తున్న పుస్తక కవర్ పై దాఖలైన దావాను కేరళ హైకోర్టు కొట్టి వేసింది.
Kerala High Court Big Relief
ఇదిలా ఉండగా కొచ్చికి చెందిన రాజ్సింహన్ దాఖలు చేశారు పిల్ ను. ప్రధాన న్యాయమూర్తి నితిన్ జామ్దార్ , న్యాయమూర్తి బసంత్ బాలాజీలతో కూడిన డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. మదర్ మేరీ కమ్స్ టు మీ పుస్తకం కవర్ చిత్రం తప్పనిసరి ఆరోగ్య హెచ్చరిక లేబుల్ లేకుండా రచయిత ధూమపానం చేస్తున్నట్లు చూపినందున చట్ట బద్ధమైన నిబంధనలను ఉల్లంఘించిందని పిటిషనర్ దావాలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా బుకర్ ప్రైజ్ విజేత రచయిత తరపు న్యాయవాది తగినంత పరిశోధన లేకుండానే పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఈ చిత్రం ధూమపానాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించ బడలేదని ప్రచురణకర్త స్పష్టం చేయడం గమనించలేదని వాదించారు.
Also Read : Babar Azam Growth : టెస్టు ఛాంపియన్ షిప్ లో బాబర్ రికార్డ్
