హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు పొందాడు అనిల్ రావిపూడి. ఆయన తీసిన ప్రతి మూవీ బిగ్ సక్సెస్. తనను సినిమాలో దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చింది నందమూరి కళ్యాణ్ రామ్. దీంతో తనతో మరో మూవీ వెంకటేష్ తో కలిసి తీస్తున్నాడు. ఇందులో వెంకటేశ్, కీర్తి సురేష్, శ్రీనిధి శెట్టి, కళ్యాణ్ రామ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం కర్ణాటకలోని ఊటీలో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియోస్ , ఫోటోలు షేర్ చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తను సినిమా తీసేటప్పుడు అందరికంటే భిన్నంగా ప్రచారం చేస్తాడు. ఇప్పుడు సరికొత్తగా ప్లాన్ చేశాడు. సినిమా పేరే విచిత్రంగా జనవరి 12 విడుదల అని పెట్టాడు. దీనిపై మరింత ఆసక్తి పెంచేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు రావిపూడి.
శనివారం మరో కీలక అప్ డేట్ ఇచ్చాడు మూవీ గురించింది. ఈ సినిమాలో లతా రెడ్డిగా కీర్తి సురేష్ రాబోతోందని తెలిపాడు. ఈ నటి ప్రస్తుతం తన 34వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆమె అభిమానులు , సహనటులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు. మరోవైపు ఆమె నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ చిత్ర బృందం కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. అందులో ఆమెను ‘లతారెడ్డి’ పాత్రలో పరిచయం చేసింది. ఆ పోస్ట్లో ఇలా పేర్కొన్నారు అందమైన, హుందైన , అద్భుతమైన ప్రతిభ కలిగిన కీర్తి సురేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి ‘జనవరి 12 విడుదల’ చిత్రంలో ‘లతారెడ్డి’గా ఆమె ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. 2027 జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది అని ప్రకటించాడు దర్శకుడు.

















