Kavitha : కామారెడ్డి జిల్లా : జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా జుక్కల్ నియోజకవర్గంలోని నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జుక్కల్ నియోజకవర్గానికి సాగు నీరు ఇచ్చే వ్యవస్థ చాలా తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నిజాం సాగర్ ఉన్నప్పటికీ దాని ద్వారా జుక్కల్ కు ప్రయోజనం లేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు కవిత. జుక్కల్ లో చెరువుల ద్వారా 22 వేల ఎకరాలు, కౌలాస్ నాలా ద్వారా 9 వేల ఎకరాలు సాగు అవుతోందని చెప్పారు. మహారాష్ట్రతో పంచాయతీ కారణంగా లెండి ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి కాకుండా ఉందన్నారు.
Kavitha Demand
ముందుగా జుక్కల్ లో 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నాగమడుగు లిప్ట్ ప్లాన్ చేశారని అన్నారు కవిత.
మంజీర నది నుంచి నీటిని ఎత్తి పోసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందు కోసం దాదాపు 2 వందల ఎకరాలపై పైగా భూ సేకరణ అవసరం అన్నారు. అయితే పంప్ హౌస్ కు కావాల్సిన 12 ఎకరాలు మాత్రమే సేకరించారని చెప్పారు. కరకట్ట, చెక్ డ్యామ్ కోసం 200 ఎకరాల భూ సేకరణ అవసరమైతే గుంట కూడా సేకరించ లేదన్నారు. పైగా రాళ్లు అడ్డం పెట్టి నిర్మాణాలు మొదలు పెట్టారని , దీంతో ఇక్కడి మూడు గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు వాపోయారు. పైగా తమకు నీళ్లు రావని కూడా ఇక్కడి ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత.
Also Read : Kharge Strong Focus on Karnataka CM Issue : కర్ణాటక సీఎం వివాదంపై ఖర్గే కీలక కామెంట్స్
















