Kasturi Tella Interesting Comments : రాష్ట్ర ప్రగతికి కలిసి పని చేద్దాం : కస్తూరి తెల్లా

సమాచార పౌర సంబంధాల శాఖ ఆర్ జె డి

Hello Telugu - Kasturi Tella Interesting Comments

Hello Telugu - Kasturi Tella Interesting Comments

Kasturi Tella : విజయవాడ : జర్నలిస్టులు, సమాచార పౌర సంబంధాల శాఖ వేరు కాదని రాష్ట్ర ప్రగతికి కలిసి పని చేద్దామని ఆ శాఖ ఆర్ జె డి కస్తూరి తెల్లా (Kasturi Tella) పేర్కొన్నారు. హోటల్ ఐలాపురం శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్ లో జరిగిన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ కార్యవర్గ సమావేశాలు సంఘ అధ్యక్షుడు సురేష్ శర్మ అధ్యక్షతన రెండు రోజులు పాటు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశాల్లో 18 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ముగింపు సమావేశాలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. సమాచార శాఖ అధికారిణిగా ఇంకా పది సంవత్సరాల సర్వీస్ ఉందని, జర్నలిస్టులతో కలిసి పని చేసే సదావకాశంగా భావిస్తానన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ఆ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తున్నారన్నారు.

Kasturi Tella Key Comments

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అందజేయాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేషనల్ మీడియా ప్రతినిధులను ఆమె చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. సురేష్ శర్మ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్ యు జె (ఇండియా) నిరంతర పోరాటం చేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో విస్తరించిన సంస్థ పాత్రికేయులకు అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో సీనియర్ జర్నలిస్టులు (Journalists), వివిధ రంగాల్లో సామాజిక సేవ చేస్తున్న ప్రముఖులకు ఎన్ యు జె జీవిత సాఫల్య పురస్కారాలు అంద చేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో కోసూరి మాధవ కృష్ణ, తోట భవన్నారాయణ, సమ్మెట్ నాగ మల్లేశ్వరరావు, డాక్టర్ సిహెచ్ దుర్గానాథ్, తాడి రంగారావు, పెద్దిరాజులు, పారిశ్రామికవేత్త అశ్విన్, బాలగంగాధర్ తిలక్, శివ కేశవరావు, పాలవెల్లి మధు, సారంగపాణి అయ్యంగార్, జీవి రాజగోపాలరావు, చలసాని ఆంజనేయులు, వరద నాగేశ్వరరావు, సాయిబాబు ఉన్నారు. పలువురు మహిళా జర్నలిస్టుల ఉత్తమ సేవలకు గాను గౌరవ పురస్కారాలు అందచేశారు.

Also Read : Vice Presidential Election Sensational : ఉప రాష్ట్ర‌ప‌తి ఎవ‌రో తేలేది నేడే

Exit mobile version