చెన్నై : ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని కరూర్ లో చేపట్టిన టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ చేపట్టిన ప్రచార ర్యాలీ, సమావేశం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద ఎత్తున గాయపడ్డారు. ఈఘటనపై కేంద్ర హోం శాఖ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర సర్కార్ రిటైర్డ్ జడ్జి అరుణ గణేశన్ ను నియమించారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. . ఈ సందర్బంగా మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి పూర్తి వైద్య చికిత్సలు అందజేస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో కేంద్ర సర్కార్ కూడా సాయం ప్రకటించింది.
ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షలు , గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున సాయం ప్రకటించారు. ఇదే సమయంలో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కీలక ప్రకటన చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల చొప్పున, గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు భరిస్తానని ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసేలా చేసింది. ఇదే సమయంలో టీవీకే పార్టీ బాధ్యులపై కేసులు నమోదు చేశారు. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. విజయ్ తన పర్యటనను తాత్కాలిక వాయిదా వేసినట్లు టీవీకే పార్టీ అధికారికంగా వెల్లడించింది. కొన్ని వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
