హైదరాబాద్ : హిందువుల ఇతిహాసంగా భావించే రామాయణం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు కేరళలో జరిగిన లిటరరీ ఫెస్టివల్ లో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్. ఈ సందర్బంగా ఆయనపై పలు చోట్ల పలువురు ప్రకాశ్ రాజ్ పై భగ్గుమన్నారు. హిందూ బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయనపై మరో నటి , బీజేపీ సీనియర్ నాయకురాలలు కరాటే కళ్యాణి భగ్గుమన్నారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఫిర్యాదు చేశారు. తనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రామాయణంపై అనుచిత కామెంట్స్ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ పౌరాణిక ఇతిహాసాలను అవమానించడం దారుణమన్నారు. భారతీయ పౌరాణిక ఇతిహాసాలను అవమానించినందుకు ఆమె ప్రకాష్ రాజ్‌ను తీవ్రంగా విమర్శించారు. లక్షలాది మంది ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని అవమానించే వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కరాటే కళ్యాణి. ఆ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆమె ఆరోపించారు. ఆమె పంజగుట్ట ఇన్‌స్పెక్టర్ ఎం. రామకృష్ణను కలిసి ఫిర్యాదు చేశారు.
ప్రకాష్ రాజ్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జనవరి 2026లో కోజికోడ్‌లో జరిగిన కేరళ సాహిత్య ఉత్సవంలో ప్రకాష్ రాజ్ ప్రసంగిస్తూ, శ్రీరాముడిపైనా, రామాయణంపైనా అత్యంత అవమానకరమైన, వక్రీకరించిన, దురుద్దేశ పూరిత వ్యాఖ్యలు చేశారని కళ్యాణి ఆరోపించారు. బీఎన్ఎస్ సెక్షన్లు 196, 299, 353, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, వీడియో క్లిప్‌ల మూలాన్ని గుర్తించాలని, అవి ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నందున ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద వాటిని బ్లాక్ చేయడాన్ని పరిశీలించాలని కళ్యాణి పోలీసులను కోరారు.

















