ఢిల్లీ : బిజెపి ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంట్ లో తన గొంతు విపారు. ఆమె ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని ఏకి పారేశారు. వారికి ఈ దేశం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తమ నాయకులు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను లక్ష్యంగా చేసుకుని అనుచిత కామెంట్స్ చేయడం తప్పా వారికి పనీ పాటా లేకుండా పోయిందని మండిపడ్డారు. పాత విషయాలను వదిలేయండి, మేము పాత విషయాల గురించి మాట్లాడం, గత నాయకుల గురించి మాట్లాడమని అని చెప్పే ప్రియాంక గాంధీని నేను గుర్తు చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను మీ తల్లి గురించి అడగాలనుకుంటున్నాని అన్నారు కంగనా రనౌత్. ఆమెకు ఇంతకు ముందు పౌరసత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోనియా గాంధీకి 1983లో పౌరసత్వం లభించిందని ఆరోపించారు కంగనా రనౌత్. అయినప్పటికీ ఆమె అంతకు ముందే ఓటు వేసిందని అన్నారు. ఇది ఎలా సాద్యమైందని ప్రశ్నించారు.. ప్రియాంక గాంధీ కూడా దీన్ని గుర్తుంచు కోవాలని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ. అది మీ గతం అయినా, మీ వర్తమానం అయినా, మీ వ్యక్తిత్వంలో సమగ్రత లేదని పేర్కొన్నారు. మీ కుటుంబం ఈ దేశ చట్టాన్ని లేదా రాజ్యాంగాన్ని ఎప్పుడూ గౌరవించ లేదని, ఇది చరిత్ర చెప్పిన సత్యం అన్నారు. గాంధీ, నెహ్రూ పేరు చెప్పుకుని ఇలా ఇంకెంత కాలం రాజకీయాలు చేస్తారంటూ నిప్పులు చెరిగారు కంగనా రనౌత్.
