Popular Actor Kangana Ranaut : పార్టీలు వేరైనా లీడ‌ర్లంతా ఒక్క‌టే – కంగ‌నా ర‌నౌత్

ఇండియా కూట‌మిలో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు

Hello Telugu - Popular Actor Kangana Ranaut

Hello Telugu - Popular Actor Kangana Ranaut

Kangana Ranaut : ముంబై – బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. బీజేపీ, ప్రధాని మోదీ, అమిత్ షాల నిజ స్వరూపాన్ని బయట పెట్టింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో బీజేపీ నాయకులకు మంచి అనుబంధాలు ఉన్నాయని స్ప‌ష్టం చేసింది. టీవీల ముందే గొడవ పడతారే తప్పా తెర వెనుక మాత్రం అంతా కలిసి పార్టీ చేసుకుంటారని అన్నారు. త‌న‌కు కూడా ఇండియా కూట‌మిలో మంచి స్నేహితులు ఉన్నారంటూ చెప్పారు కంగ‌నా (Kangana Ranaut). చిట్ చాట్ సంద‌ర్బంగా ప‌లు అంశాల‌పై స్పందించింది. త‌న మ‌న‌సులోని అభిప్రాయాల‌ను బ‌హిరంగంగా వెలిబుచ్చ‌డం క‌ల‌క‌లం రేపింది.

MP Kangana Ranaut Comments

పార్టీలు వేర్వేరు అయిన‌ప్ప‌టికీ పొలిటిక‌ల్ లీడ‌ర్లంతా ఒక్క‌టేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌ముఖ న‌టి, ఎంపీ కంగ‌నా ర‌నౌత్. ఈసంద‌ర్భంగా త‌న రాజ‌కీయ జీవితం గురించి కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తాను పొలిటికల్ ప‌రంగా స‌రిగా ఆస్వాదించ‌డం లేద‌ని వాపోయారు. మహిళల హక్కుల కోసం తాను ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పారు కంగ‌నా ర‌నౌత్. నటిగా మారిన రాజకీయ నాయకురాలు ఇటీవల ఆత్మ నిర్భర్ భారత్ పాడ్‌కాస్ట్‌లో చిట్ చాట్ చేసింది.

మీరంతా అనుకున్న‌ట్టు నేను పొలిటిక‌ల్ ప‌రంగా స్వేచ్ఛ‌గా ఉన్నాన‌ని అనుకుంటున్నార‌ని, కానీ అంత సీన్ లేద‌న్నారు కంగ‌నా ర‌నౌత్. ఇది చాలా భిన్నమైన పని, సామాజిక సేవ లాంటిది. ఇది నా నేపథ్యం కాదు. ప్రజలకు సేవ చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదన్నారు. మహిళల హక్కులకు చాలా కాలంగా మద్దతు ఇస్తున్నప్పటికీ, ఒక రాజకీయ నాయకురాలిగా రోజువారీ అంచనాలను నావిగేట్ చేయడం ఆశ్చర్యకరంగా ఉందంటూ స్ప‌ష్టం చేసింది.

Also Read : Prasanna Kumar Reddy Shocking Comments : మా బ్ల‌డ్ లో భ‌య‌ప‌డ‌టం అన్న‌ది లేదు – ప్ర‌స‌న్న‌

Exit mobile version