Prasanna Kumar Reddy Shocking Comments : మా బ్ల‌డ్ లో భ‌య‌ప‌డ‌టం అన్న‌ది లేదు – ప్ర‌స‌న్న‌

మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Prasanna Kumar Reddy Shocking Comments

Hello Telugu - Prasanna Kumar Reddy Shocking Comments

Prasanna Kumar Reddy : నెల్లూరు జిల్లా – మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంత్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ కుటుంబానికి భ‌యం అంటే ఏమిటో తెలియ‌ద‌న్నారు. తాము ఎంత దూర‌మైనా వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు. త‌న చేతికి కొంత గాయం కావ‌డం వ‌ల్ల ఆస్ప‌త్రికి వెళితే త‌న‌కు భ‌య‌ప‌డి పారి పోయానంటూ ప్ర‌చారం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న ఇంటి మీద దాడి చేసిన వాళ్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సిద్దంగా ఉంద‌న్నారు. త‌నలో ఉంది త‌న తండ్రి శ్రీ‌నివాస్ రెడ్డి ర‌క్తం ఉంద‌ని, ఎవ‌రొస్తారో రావాల‌ని మాజీ ఎమ్మెల్యే స‌వాల్ విసిరారు.

Prasanna Kumar Reddy Shocking Comments

ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి (Prasanna Kumar Reddy) మీడియాతో మాట్లాడారు. త‌మ బ్ల‌డ్ లో భ‌య‌ప‌డ‌టం అన్న‌ది తెలియ‌ద‌న్నారు. ఎదురొడ్డి పోరాడ‌ట‌మే త‌ప్పా త‌ల వంచే ర‌కం కాద‌న్నారు. ఈ విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ప్ర‌తి ఒక్క‌రికి తెలుసన్నారు మాజీ ఎమ్మెల్యే. చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తూ త‌మ‌ను బ‌ద్నాం చేయాల‌ని చేస్తూ ఎవ‌రూ ఊరుకోర‌న్నారు. ఆఫ్ట్రాల్ త‌ను ఓ ఎమ్మెల్యే అని, ఆమె చేస్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ పూర్తిగా అవాస్త‌వాల‌ని పేర్కొన్నారు. త‌న ఇంటి మీద దాడి చేసింది వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు. నా కాళ్లు చేతులు కట్టేసి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి త‌న‌ కాళ్ల కింద పడేయాలని వాళ్ల మనుషులకు చెప్పిందని ఆరోపించారు. ఎవ‌రు వ‌స్తారో రావాల‌ని చూసుకుంటామ‌ని ఛాలెంజ్ విసిరారు న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి.

Also Read : Minister Ponnam Prabhakar Proven : 17 వేల జాబ్స్ తో క్యాలెండ‌ర్ సిద్దం – పొన్నం

Exit mobile version