Kandula Durgesh : అమరావతి : రాజస్థాన్ లో పర్యటించేందుకు బయలు దేరి వెళ్లారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. అక్టోబర్ 14, 15 తేదీల్లో ఉదయ్‌పూర్‌లో పర్యటిస్తారు. దేశంలో ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడగల 50 పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల కల్పన కోసం ఉద్దేశించిన జాతీయ మిషన్ పై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులు.
Minister Kandula Durgesh Visit
పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటనల అమలుపై రాష్ట్ర విజన్‌ను సమర్పించనున్నారు మంత్రి దుర్గేష్ (Kandula Durgesh). జాతీయ మిషన్ క్రింద ఆంధ్రప్రదేశ్ తరపున ఉన్న ప్రతిపాదనలను వివరిస్తారు. ఆయా రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రధాన పర్యాటక గమ్య స్థానాలను రాష్ట్రాల భాగస్వామ్యంతో ‘ఛాలెంజ్ మోడ్’ లో అభివృద్ధి చేయనుంది కేంద్ర సర్కార్. పర్యాటక సౌకర్యాలు, పరిశుభ్రత, మార్కెటింగ్ ప్రయత్నాలతో సహా సమర్థవంతమైన గమ్యస్థాన నిర్వహణ కోసం రాష్ట్రాలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు అందించనుంది కేంద్రం.
పర్యాటక ప్రాంతాల మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన భూమిని అందించనున్నాయి రాష్ట్రాలు. జాతీయ మిషన్ లక్ష్యాలను సాధించేందుకు, ప్రైవేట్ పెట్టుబడులు, స్థానిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను వివరించనున్నారు మంత్రి కందుల దుర్గేష్.
Also Read : CM Chandrababu Important Update : అమరావతిలో అందుబాటులోకి సీఆర్డీఏ
