Minister Kandula Durgesh New Innovation : ప‌ర్యాట‌క ప్రాంతాల్లో లిడ్ క్యాప్ స్టాళ్ల ఏర్పాటు

ప్ర‌క‌టించిన ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్

Hello Telugu - Minister Kandula Durgesh New Innovation

Hello Telugu - Minister Kandula Durgesh New Innovation

Kandula Durgesh : గుంటూరు జిల్లా : ఏపీలోని ప‌ర్యాట‌క ప్రాంతాల‌లో లిక్ క్యాప్ స్టాళ్ల‌ను ఏర్పాటు చేసేందుకు ప్రోత్స‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). శ‌నివారం గుంటూరు జిల్లాలో జరిగిన లిడ్ క్యాప్ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొని ప్ర‌సంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లెదర్ ఇండస్ట్రీ అభివృద్ధికి ఆర్థిక పరిపుష్టి కల్పించాల్సిన అవసరం ఉంద‌న్నారు. లిడ్ క్యాప్ ద్వారా శిక్షణ పొందిన యువతకు సర్టిఫికెట్లు ప్రదానం చేయ‌డం ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నారు. పాదరక్షలు తయారు చేసే ప్రత్యేక సంస్థగా విరాజిల్లుతున్న లిడ్ క్యాప్ ద్వారా లెదర్ ఇండస్ట్రీ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు. గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం చర్మకారులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీకి మల్టీ నేషన్ కంపెనీలతో పోటీ పడే సత్తా ఉందన్నారు. ఆ సంస్థకు గత వైభవాన్ని తిరిగి తెచ్చే విధంగా లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాల రావు చేస్తున్న కృషిని అభినందించారు.

Minister Kandula Durgesh Comments

ఎంతో మందికి లిడ్ క్యాప్ ద్వారా శిక్షణ అందించి జీవితంలో స్థిరపడేందుకు దోహద పడిన సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లెదర్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పులను అంది పుచ్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లిడ్ క్యాప్ కి సరైన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మాదిగ యువతకు సపోర్ట్ గా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వెదర్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసి సంబంధిత ఇండస్ట్రీపై ఆధారపడిన యువతకు సముచిత స్థానం కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. లిడ్ క్యాప్ సంస్థకు నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. వర్గీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి దుర్గేష్ (Kandula Durgesh) ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు జిల్లా స్థానిక ఎమ్మెల్యేలు మాధవి, నజీర్ అహ్మద్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు, టీడీపీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య, లిడ్ క్యాప్ ఎండీ, ప్రసన్న వెంకటేష్, ఐఏఎస్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : Dr Sirisha Strong Demand : గంగమ్మ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

Exit mobile version