Kandula Durgesh : లండన్ : పర్యాటక రంగంపై తమ సర్కార్ ప్రత్యేక దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). వరల్డ్ ట్రావెల్ మార్కెట్ – 2025 ప్రదర్శనలో మూడో రోజు కార్యక్రమంలో భాగంగా పలు దేశాల అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లతో, టూరిజం బోర్డులతో సమావేశమై ఉమ్మడి మార్కెటింగ్ ప్రచారం, పర్యాటక అభివృద్ధిపై చర్చంచారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అనుసరిస్తున్న పర్యాటక అభివృద్ధి ప్రమాణాలు, విధానాలు, పెట్టుబడుల అవకాశాలను పరిశీలించారు. ముఖ్యంగా వచ్చే ఏడాది సౌదీ అరేబియాలో జరగనున్న అరేబియా ట్రావెల్ మార్కెట్ కు హాజరు కావాలని ఆ దేశ టూరిజం ప్రతినిధులు ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు కందుల దుర్గేష్.
Minister Kandula Durgesh Comments
ఏపీ పర్యాటక ప్రాజెక్టులు, పెట్టుబడి అనుకూల వాతావరణం గురించి వివరించి, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఇన్వెస్టర్లను ఆహ్వానించానని చెప్పారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి మీడియాతో తను అనుభవాలను పంచుకున్నారు. లండన్‌లోని ఇండియన్ హైకమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైటీ కార్యక్రమంలో పాల్గొని, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ భవిష్యత్ అవకాశాలను వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరడం జరిగిందన్నారు. ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ తనదైన స్థానం సంపాదించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ మరోసారి స్పష్టం చేశారు.
Also Read : DY CM Pawan Kalyan Clear Update : ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం
