Minister Kandula Durgesh Strong Focus : ప‌ర్యాట‌క రంగంపై స‌ర్కార్ ఫోక‌స్ : కందుల దుర్గేష్

పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌చ్చాయి

Hello Telugu - Minister Kandula Durgesh Strong Focus

Hello Telugu - Minister Kandula Durgesh Strong Focus

Kandula Durgesh : విశాఖ‌ప‌ట్నం : ఏపీని ప‌ర్యాట‌క రంగానికి కేంద్రంగా త‌మ స‌ర్కార్ మారుస్తోంద‌ని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). విశాఖ‌పట్నం కేంద్రంగా జ‌రిగిన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు నాయుడుతో పాటు తాను కూడా పాల్గొన్నారు. ఈసంద‌ర్బంగా కోర్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతో కీల‌క స‌మావేశం జ‌రిగింది. కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తీర పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఇందుకు కోర్డెలియా క్రూయిజెస్‌ కలిసి రావాలని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కోరారు. విశాఖ–కాకినాడ–భీమునిపట్నం పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై చర్చించిన‌ట్లు తెలిపారు మంత్రి కందుల దుర్గేష్.

Minister Kandula Durgesh Comments

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై కోర్డెలియా క్రూయిజెస్‌ ఆసక్తి చూపారని ఈ సంద‌ర్బంగా వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఏపీ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప‌ర్యాట‌క రంగానికి సంబంధించి ప్ర‌త్యేకంగా పాల‌సీని తీసుకు వచ్చిన‌ట్లు చెప్పారు. ప‌ర్యాట‌క రంగం ప‌రంగా గమ్య స్థానంగా మార్చేందుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదే స‌మ‌యంలో లండ‌న్ వేదిక‌గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ టూరిజం స‌మ్మిట్ లో ఏపీ త‌ర‌పున పాల్గొన్నామ‌ని, తాము ఏర్పాటు చేసిన స్టాల్ కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్‌.

Also Read : LuLu Group Huge Investments in Rayalaseema : రాయలసీమలో లాజిస్టిక్ ప్రొక్యూర్ మెంట్ ఎక్స్ పోర్ట్ కేంద్రం

Exit mobile version