Kakani Fired on Speaker : స్పీకర్ అయ్యన్నపై కాకాణి ఫిర్యాదు

పోలీసుల‌పై దుర్భాష‌లాడ‌టంపై ఫైర్

Hello Telugu - Kakani Fired on Speaker

Hello Telugu - Kakani Fired on Speaker

Kakani : నెల్లూరు జిల్లా – నెల్లూరు నగరంలోని వేదయపాళెం పోలీస్ స్టేషన్ లో పోలీసులపై దుర్భాషలాడిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రునిపై శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, డిసిసిబి మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి (Kakani). రాజ్యాంగ సంస్థలో ఒక ఉన్నతమైన బాధ్యతను నిర్వర్తించే స్థానం గౌరవ శాసనసభ స్పీకర్ స్థానం అన్నారు. స్పీకర్ గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా రావికమటం మండలంలో దొండపూడి గ్రామంలో కొత్తకోట సిఐ, ఎస్ఐల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు.

Kakani Govardhan Reddy Slams Speaker Ayyanna Patrudu

ఎస్కార్ట్ ఆలస్యమైందని అయ్యన్నపాత్రుడు పోలీసు అధికారులను తిట్టడం, టిడిపి నాయకులు ఈలలు వేయడం, చప్పట్లు కొట్టడం బాధాకరం అన్నారు. పోలీసుల ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అయ్యన్నపాత్రుని వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు పోలీసు అధికారులను దుర్భాష లాడటం ప్రసారం చేశాయన్నారు. ఇంత జ‌రిగినా పోలీసు సంఘాలు అయ్యన్నపాత్రుని వ్యాఖ్యలపై స్పందించక పోవడం విడ్డూరంగా ఉంద‌న్నారు. పోలీస్ వ్యవస్థ మీద, పోలీసుల మీద మాకు గౌరవం, నమ్మకం ఉన్నాయ‌న్నారు కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి.

కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టారన్నారు . జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో ఎక్కడా పోలీసులను ఒక్క మాట కూడా అగౌరవంగా మాట్లాడ లేద‌న్నారు. న్యాయ స్థానాలు మమ్మల్ని దోషులుగా నిర్ధారించ లేదని, కానీ పోలీసు సంఘాలు మాత్రం మమ్మల్ని దోషులుగా నిర్ధారించేసింద‌న్నారు. అధికార పార్టీ నాయకులు మాట్లాడితే భరిస్తాం, ప్రతిపక్ష నాయకులు పోలీసుల పేరు ఎత్తినా భరించం అన్నట్లు పోలీసు సంఘాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

Also Read : YS Sharmila Fired on AP Govt : దివ్యాంగుల పొట్ట కొడితే ఎలా..?

Exit mobile version