Ka Paul Shocking Comments : బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ ల‌పై కేసుల మాటేంటి..?

నిప్పులు చెరిగిన ప్ర‌జాశాంతి చీఫ్ పాల్

Hello Telugu - Ka Paul Shocking Comments

Hello Telugu - Ka Paul Shocking Comments

Ka Paul : హైద‌రాబాద్ – ఈ దేశంలో చ‌ట్టం అధికారాన్ని బ‌ట్టి, ప‌ద‌వుల బ‌ట్టి మారుతూ ఉంటుంద‌న్నారు ప్ర‌జాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్ట‌ర్ కేఏ పాల్ . ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్స్ కేసులో 29 మంది సెలిబ్రిటీలు, ప్ర‌ముఖులపై ఈడీ కేసు న‌మోదు చేయ‌డం ప‌ట్ల స్పందించారు. ఇదే యాప్స్ ను ప్ర‌మోట్ చేసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌పై ఎందుకు కేసులు న‌మోదు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. గురువారం కేఏ పాల్ (Ka Paul) మీడియాతో మాట్లాడారు. బీజేపీతో క‌లిసి ఉన్నందుకు వాళ్ల‌ను వదిలి వేశారా అని నిల‌దీశారు. మీతో క‌లిస్తే కేసులుండ‌వు క‌ల‌వ‌క పోతే కేసులు న‌మోదు చేస్తారా..ఇదేనా మీ దేశం కోసం ధ‌ర్మం కోసం నినాదం అంటూ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

Ka Paul Comments

ఇదిలా ఉండ‌గా దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్స్ కేసు సంచ‌ల‌నం రేపింది. బెట్టింగ్ యాప్స్ కేసులో 29 మంది సెలిబ్రిటీలపై కేసు న‌మోదు చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ. మ‌నీ లాండ‌రింగ్ చోటు చేసుకుంద‌ని తెలిపింది. రానా, ప్ర‌కాశ్ రాజ్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మంచు ల‌క్ష్మి, నిధి అగ‌ర్వాల్, అన‌న్య నాగ‌ళ్ల‌, సిరి హ‌నుమంతు, శ్రీ‌ముఖి, వ‌ర్షిణి సౌంద‌ర రాజ‌న్, వాసంతి కృష్ణ‌న్, శోభా శెట్టి, అమృత చౌద‌రి, న‌య‌ని పావ‌ని, నేహా ప‌ఠాన్, పాండు, ప‌ద్మావ‌తి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ‌, హ‌ర్ష సాయి, స‌న్నీ యాద‌వ్ , శ్యామ‌ల‌, టేస్టీ తేజ‌, రీతు చౌద‌రి, సుప్రీత‌, కిర‌ణ్ గౌడ్, అజ‌య్, స‌న్నీ, సుధీర్ , లోక‌ల్ బాయ్ నానిల‌పై కేసులు న‌మోద‌య్యాయి.

ఈ మొత్తం వ్య‌వ‌హారంలో చ‌ట్టం పూర్తిగా ప‌ని చేయ‌లేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. పోలీసులు ఎందుకు వారిపై న‌మోదు చేయ‌లేదో చెప్పాల‌ని డాక్ట‌ర్ కేఏ పాల్ డిమాండ్ చేశారు. లేక పోతే తాను కోర్టుకు వెళ‌తానంటూ హెచ్చ‌రించారు.

Also Read : AR Rahman Interesting Event : హైద‌రాబాద్ లో ఏఆర్ రెహ‌మాన్ క‌చేరి

Exit mobile version