AR Rahman : ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందిన భారతీయ సినీ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ (AR Rahman) మ్యూజిక్ కచేరి హైదరాబాద్ లో త్వరలో ఉండబోతోంది. తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన ఈ స్వరకర్త గురించి ఎంత చెప్పినా తక్కువే. బతుకు దెరువు కోసం జింగిల్స్ చేసుకుంటూ ఉన్న తనను చూశాడు సృజనాత్మకతకు పేరు పొందిన దర్శకుడు మణిరత్నం. ఇంకేం తను తీసిన రోజా చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు. అప్పటి దాకా ఓ మూస ధోరణిలో కొనసాగుతున్న భారతీయ సినీ జగత్తులో ఉన్నట్టుండి తన పాటలు, సంగీతంతో ప్రభంజనం సృష్టించాడు ఏఆర్ రెహమాన్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో చిరస్మరణీయమైన గీతాలను అందించాడు. సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా తను ఎన్నో అవార్డులను, మరెన్నో పురస్కారాలను పొందాడు.
AR Rahman Music Event in Hyderabad
ప్రపంచంలోనే అత్యున్నతమైన ఆస్కార్ అవార్డును సైతం స్వంతం చేసుకున్నాడు ఏఆర్ రెహమాన్. మ్యాస్ట్రో ఇళయరాజా వద్ద కీ బోర్డు ప్లేయర్ గా ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు యావత్ ప్రపంచం తన వైపు చూసేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఓ వైపు సినిమాలకు సంగీతం అందిస్తూనే ఇంకో వైపు సంగీత కచేరీలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది తన నుంచి. సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశాడు అల్లా రఖా రెహమాన్. తెలుగు ప్రేక్షకులకు తనంటే పిచ్చి ప్రేమ. వచ్చే నవంబర్ నెల 8వ తేదీన హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో సంగీత కచేరి ఉంటుందని , సినీ, సంగీత ప్రేమికులు రావాలని కోరాడు. తను సినీ రంగానికి వచ్చి 30 ఏళ్లవుతోంది. ఈ సందర్బంగా వండర్ మెంట్ టూర్ పేరుతో కచేరీలో చేస్తున్నాడు. అందులో భాగంగా నగరానికి రానున్నాడు.
Also Read : Hero Prabhas-Baahubali : ప్రభాస్ బాహుబలి రీ రిలీజ్ కు సిద్దం
