K Kavitha Sensational Comments : ప్ర‌జ‌లు కోరుకుంటే రాజ‌కీయ పార్టీ పెడతా

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఎమ్మెల్సీ క‌విత‌

Hello Telugu - K Kavitha Sensational Comments

Hello Telugu - K Kavitha Sensational Comments

K Kavitha : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌జ‌లు కావాల‌ని కోరుకుంటే తాను రాజ‌కీయ పార్టీని పెట్టేందుకు సిద్దంగా ఉన్నాన‌ని అన్నారు. అయితే పార్టీ పెడితే నాకు కాదు ప్రజలకు మేలు జరగాలన్నారు. అందుకే ప్రజాభిప్రాయం ఏంటో తెలుసు కోవటానికే ‘జనం బాట’ కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టాన‌ని చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి 4 నెల‌ల పాటు ప్ర‌జ‌లను ప్ర‌త్య‌క్షంగా క‌లిసేందుకు వ‌స్తున్నాన‌ని వెల్ల‌డించారు. అన్ని వర్గాలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామ‌న్నారు. గురువారం యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు క‌విత‌ (K Kavitha), జాగృతి నాయకులు.

K Kavitha Sensational Comments

‘జనం బాట’ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరేందుకు శ్రీ‌ లక్ష్మీ నరసింహాస్వామి ఆశీస్సుల కోసమే వచ్చామ‌ని చెప్పారు. మొన్న తిరుపతి వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నాం. ఇప్పుడు న‌ర‌సింహ స్వామికి పూజ‌లు చేశాన‌ని అన్నారు క‌విత‌. ‘జనం బాట’ కార్యక్రమానికి ఎలాంటి అవాంతారాలు రాకుండా చూడాలని స్వామి వారిని కోరుకున్నామ‌ని తెలిపారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకునే శక్తి ఇవ్వాలనే దైవ దర్శనం చేసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు . ఈ నెల 25 నుంచి మా సొంత ఊరు నిజామాబాద్ నుంచి ‘జనం బాట’ కార్యక్రమం మొదలవుతుంద‌న్నారు. 33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్ర‌క‌టించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

Also Read : Paul Kapur Growth : యుఎస్ స‌హాయ కార్య‌ద‌ర్శిగా పాల్ క‌పూర్

Exit mobile version