Jimmy Wales : హైదరాబాద్ – ఎవరీ జిమ్మీ వేల్స్ అనుకుంటున్నారా. తను చేసిన పని ఇవాళ కోట్లాది మందికి ఉపయోగ పడేలా చేసింది. ప్రతి ఒక్కరు ఏ సమాచారం కావాలన్నా వెదికేది గూగుల్ లో వికీపీడియా. ఇది ఎలాంటి లాభాపేక్ష లేని విజ్ఞాన సర్వస్వం. తను వికీపీడియా సహ వ్యవస్థాపకుడు. తను నాస్తికుడు. తను ఆగస్టు నెలలో పుట్టాడు. తన పుట్టిన తేది 7. జిమ్మీ వేల్స్ (Jimmy Wales) అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యువర్. వికీపీడియాను స్థాపించడమే కాకుండా ఇతర వికీ-సంబంధమైన ప్రాజెక్టులు (అంటే ఈ తెలుగు వికిపీడియా తో కలిపి) ప్రారంభించారు. లాభం ఆశించని ఛారిటబుల్ సంస్థ వికీమీడియా ఫౌండేషన్ ను, వికీయాను కూడా నడుపుతున్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే వేల్స్ తండ్రి ఒక పచారీ దుకాణంలో పని చేశాడు. తల్లి డోరిస్ , అమ్మమ్మ ఎర్మా ఇంట్లో ఒక చిన్న ప్రైవేటు పాఠశాలను నడిపే వారు. అందులోనే వేల్స్ కొంతవరకు చదువుకున్నాడు. అతని తరగతిలో నలుగురే ఉండడంతో ఒకటో తరగతి నుండి నాలుగో తరగతి వరకూ ఒక గదిలో, ఐదు నుండి ఎనిమిది వరకూ ఇంకో గదిలో పెట్టి చదువు చెప్పారు.
Jimmy Wales Key Update
ఎనిమిదో తరగతి తరువాత, వేల్స్ హంట్స్‌విల్ అలబామాలో రాండాల్ఫ్ పాఠశాలలో చదివాడు. ఈ పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ లు ఇతర టేక్నాలజీ విద్యార్థుల వాడకానికి మొదట మద్దతు నిచ్చిన వాటిలో ఒకటి. ఈ పాఠశాల ఖరీదెక్కువైనా చదువు ముఖ్యమని కుటుంబం భావించిందని వేల్స్ (Jimmy Wales) ఒక సందర్భంలో వెల్లడించాడు. వేల్స్ ఆబర్న్ యూనివర్సిటీలో ఫైనాన్స్ లో బ్యాచిలర్స్ ,అలబామా విశ్వ విద్యాలయంలో ఫైనాన్స్ లో మాస్టర్స్ చేశాడు. అక్కడ కొన్నాళ్ళు పాఠాలు చెప్పాడు. 1994 నుండి 2000 వరకూ షేర్ మార్కెట్ లో పనిచేసి తన భార్యా పిల్లలు జీవితాంతం పని చేయక పోయినా సరిపోయేటంత డబ్బు సంపాదించాడు. ఇదే సమయంలో వేల్స్ (Jimmy Wales) చేసిన ప్రోజెక్టులలో ఒక శోధనాయంత్రం బోమిస్ (గూగుల్.కామ్ వంటిది) ను సృష్టించడానికి మద్దతునిచ్చాడు. బోమిస్ లో వచ్చిన డబ్బులు వికీపీడియా స్థాపనకు ఉపయోగపడ్డాయి.
మార్చి 2000 లో అందరిచేత రివ్యూ చెయ్యబడేలా అందరికీ అందుబాటులో ఉండేలాంటి ఉచిత విజ్ఞాన సర్వస్వం (న్యూపీడియా) ను ప్రారంభించి ల్యారీ సేంగర్ ను దాని సంపాదకునిగా నియమించాడు. 1999 లో ఒక బహు భాష విజ్ఞాన సర్వస్వం కోసం ఓ స్టూడెంట్ నుంచి డిజైన్ వచ్చింది. అది స్లోగా ఉండడంతో వాడేందుకు వీలు లేకుండా పోయిందన్నాడు. జనవరి 10, 2001 లో ల్యారీ సేంగర్ వికీని వాడి విజ్ఞాన సర్వస్వం తయారు చెయ్యవచ్చని చెప్పాడు వేల్స్ కి. దీని కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ తయారు చేశాడు. సేంగర్ దీనికి వికీపీడియా అని పేరు పెట్టి, వేల్స్ తో పాటు మౌలిక సూత్రాలను, కంటెంటును, ఇంటర్నెట్ ద్వారా రాసే వాళ్ళను దగ్గరకు చేర్చాడు. వికీపీడియా మొదట న్యూపీడియాకు అనుబంధ సైటుగా ఉండేది. కాని వికీపీడియా అనూహ్య పురోగతి న్యూపీడియా కెపాసిటీని దాటేసింది. 2002లో సేంగర్ తప్పుకున్నాడు. 2003 మధ్యలో వేల్స్ వికిమీడియా ఫౌండేషన్ ను స్థాపించాడు.
ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు జిమ్మీ వేల్స్. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి దగ్గర ఈ గ్రహం మీద ఉండే జ్ఞానమంతా అందుబాటులో ఉంటే ఎలా ఉంటుందో..ఊహించుకోండి అదే మేం చేసే ప్రయత్నం ..వికీపీడియా విజ్ఞాన సర్వస్వం.
Also Read : Jajula Srinivas Goud Alarming : గోవా గవర్నర్ తో బీసీ సంఘాల నేతలు భేటీ
