Jajula Srinivas Goud : గోవా – గోవా గవర్నర్ అశోక గజపతిరాజును మర్యాద పూర్వకంగా కలిశారు బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud), కేసన శంకర్ రావు. జాతీయ స్థాయిలో ఓబీసీల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. నూతన గవర్నర్ గా నియమితులైన ఆయనను అభినందించారు. శాలువాతో సత్కరించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. వచ్చే 2026 సంవత్సరం నుండి దేశ వ్యాప్తంగా చేపట్టబోయే కుల గణనను సమర్థవంతంగా చేపట్టేలా చూడాలన్నారు. బీసీలకు చట్టసభలో జనాభా దామషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ల కల్పన, మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోటా, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని గవర్నర్ ను కోరారు.
Jajula Srinivas Goud Meet Goa Governor
బీసీ సమస్యల ను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తప్పకుండా తీసుకెళ్లి, బీసీ డిమాండ్ల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా బీసీ నేతలకు గోవా గవర్నర్ అశోక గజపతి రాజు హామీ ఇచ్చారు. కాగా గవర్నర్ ను కలిసిన ప్రతినిధుల బృందంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, ఏపీ ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగ మల్లేశ్వరరావు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, నేతలు నరేష్ ప్రజాపతి, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బాలగుండ్ల శ్రీనివాసరావు, పూర్ణ, కాశి, హనుమంతరావు, వేముల కృష్ణ, వెంకటరావు, సతీష్ ఉన్నారు.
Also Read : Hydraa Commission Alarming : భారీ వర్షంతో మల్కం చెరువు మునక
