వాషింగ్టన్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సెన్ హువాంగ్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఆయన తిరిగి సంస్థలోకి రావాలని కోరుతూ పెద్ద ఎత్తున సంతకాల సేకరణ ప్రారంభమైంది. లక్షలాది మంది తాము సంతకాలు చేస్తూ తనకు మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో వరల్డ్ మోస్ట్ బిలియనీర్ స్టార్ లింక్ చైర్మన్, ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సైతం చేరి పోయారు. ఆయన కూడా జెన్సెన్ హువాంగ్ కు మద్దతు తెలియ చేస్తూ సంతకం చేశారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ఎన్విడియా ఉద్యోగులు, ప్రముఖ సాంకేతిక రంగ నిపుణులతో పాటు ఎలాన్ మస్క్ కూడా ఈ పిటిషన్‌కు మద్దతు తెలిపారు. జెన్సెన్ హువాంగ్‌కు సరైన న్యాయం జరగాలని, ఆయనను తిరిగి సీఈఓ గా నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 33 ఏళ్ల క్రితం ఎన్విడియాను సహ-స్థాపించిన జెన్సెన్ హువాంగ్, ఇటీవల సంస్థ నుంచి రాజీనామా చేశారు.
ఆయన నిష్క్రమణకు దారితీసిన పరిస్థితులపై పునరాలోచించాలని, ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చూడాలని కోరుతూ ‘స్టాండ్ విత్ జెన్సెన్’ అనే వెబ్సైట్ ద్వారా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. దీనికి ఇప్పటి వరకు 43,000కు పైగా సంతకాలు లభించాయి. ఎలాన్ మస్క్ తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో, జెన్సెన్ను తిరిగి నియమించాలని కోరుతూ ఒక పిటిషన్ నడుస్తోంది, నేను కూడా దానిపై సంతకం చేస్తున్నాను అని పేర్కొంటూ తన మద్దతును తెలియజేశారు. ఈ వెబ్‌సైట్‌లోని గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఎన్విడియాలో పనిచేస్తున్న 2,980 మంది ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు 454 మంది, 24,097 మంది వాటాదారులు ఈ లేఖపై సంతకాలు చేశారు. వీరితో పాటు మరో 15,517 మంది మద్దతుదారులుగా నమోదయ్యారు. అయితేఈ ప్రచారానికి ఎన్విడియా సంస్థ లేదా జెన్సెన్ హువాంగ్ ఎటువంటి మద్దతు ఇవ్వలేదని, సంతకం చేసిన వ్యక్తుల వృత్తి పరమైన వివరాలు వారి సొంత ప్రకటనల ఆధారంగా సేకరించినవని, వాటిని ధృవీకరించలేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఈ లేఖల జెన్సెన్ హువాంగ్ నిష్క్రమణకు దారితీసిన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. సరైన విచారణ ప్రక్రియ లేకుండానే ఆయనను తొలగించి ఉండవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న మహిళ నిజంగా గూఢచారి అని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అని కూడా ఈ లేఖ ప్రశ్నిస్తోంది. జెన్సెన్ నాయకత్వాన్ని ముగించడానికి కేవలం అనుమానం లేదా సంబంధం మాత్రమే సరిపోదు అని ఆ లేఖలో పేర్కొన్నారు. మద్దతుదారులు మూడు డిమాండ్లను ముందుకు తెచ్చారు.
