Jeff Bezos Shocking Expenses : అమెజాన్ వ్యవస్థాపకుడు పెళ్లి దుస్తులకు 12 కోట్లు ఖర్చుపెట్టారా?

ప్రముఖ లగ్జరీ హోటల్‌ ‘అమాన్ వెనిస్’లో బస చేశారు...

Hello Telugu - Jeff Bezos Shocking Expenses

Hello Telugu - Jeff Bezos Shocking Expenses

Jeff Bezos : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos), ప్రముఖ జర్నలిస్టు లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీలోని వెనిస్ నగరంలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. మూడు రోజుల పాటు అట్టహాసంగా సాగిన ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ జంట బుధవారం హెలికాప్టర్‌లో వెనిస్‌ చేరగా, ప్రముఖ లగ్జరీ హోటల్‌ ‘అమాన్ వెనిస్’లో బస చేశారు.

Jeff Bezos Marriage Expenses

వివాహానికి ముందు గురువారం నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. వివాహ వేడుకలు ముగింపు రోజైన ఆదివారం ప్రత్యేక పార్టీతో ముగిశాయి. ఈ వివాహానికి మొత్తం 200 మందికిపైగా అతిథులు విచ్చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, సినీ ప్రముఖులు కిమ్ కర్దాషియన్, ఒప్రా విన్‌ఫ్రే, రాణి రనియా వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

వధువు లారెన్ (Lauren Sanchez) ధరించిన తెల్లటి మెర్మైడ్ లైన్ గౌన్ డోల్చే అండ్ గబ్బానా డిజైన్ చేసినదిగా సమాచారం. ఈ దుస్తుల విలువ దాదాపు రూ. 12 కోట్లకు చేరుతుందని అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. పెళ్లికి ముందు జరిగిన ఎంగేజ్‌మెంట్ సందర్భంగా బెజోస్ లారెన్‌కు రూ. 20 కోట్ల విలువైన వజ్రపు ఉంగరం బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

పెళ్లి వేడుకలకు సంబంధించిన ఖర్చు మొత్తం స్పష్టంగా తెలియకపోయినా, సుమారు రూ. 500 కోట్ల వరకు వెచ్చించారని సమాచారం. వేదికల ఏర్పాట్లు, భద్రత, అతిథుల వసతి వంటి అన్ని ఏర్పాట్లు అత్యున్నతంగా చేపట్టారు. లేడీ గాగా, ఎల్టన్ జాన్ వంటి ప్రముఖులు సంగీత ప్రదర్శనలందించారు.

వివాహ అనంతరం లారెన్ తన సోషల్ మీడియా ద్వారా ఫొటోలు పంచుకున్నారు. తన పేరు ‘లారెన్ సాంచెజ్ బెజోస్’గా మార్చుకున్నట్టు కూడా ప్రకటించారు. ఈ వివాహం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. భవ్యత, ప్రఖ్యాతి, ఖర్చు పరంగా ఇది ఇటలీలో ఇప్పటిదాకా జరిగిన అతి వైభవమైన పెళ్లిగా నిలిచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Also Read : Minister Kishan Reddy Challenge : సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Exit mobile version