విజయవాడ : ఏపీలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలనంగా మారాడు. తను ఓ మహిళను లైంగికంగా వేధించాడు. ఆపై న్యూడ్ కాల్ తో అడ్డంగా దొరికాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో జనసేన పార్టీ తనపై చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై సీరియస్ గా స్పందించింది రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్. ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా తాజాగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సదరు ఎమ్మెల్యే తనను ఏడాదిన్నర పాటు నిరంతరం వేధింపులకు గురి చేశాడని, శారీరకంగా వాడుకున్నాడంటూ బాధితురాలు వాపోయింది. ఇందుకు సంబంధించి వీడియో రిలీజ్ చేసింది.
తన ఆరోపణలకు మద్దతుగా ఆ మహిళ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో జరిపినట్లుగా భావిస్తున్న తన చాట్‌లను విడుదల చేసింది. తనను మానసికంగా, లైంగికంగా పదేపదే వేధించారని వాపోయింది. ప్రజల ముందుకు వచ్చింది ప్రభుత్వ ఉద్యోగిని. తన వాదనలకు మద్దతుగా, ఆమె కొన్ని సన్నిహిత వీడియోలను , వాట్సాప్ చాట్ రికార్డులను విడుదల చేసింది, అవి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి, ఇది తీవ్రమైన ప్రజా చర్చకు, పదునైన రాజకీయ ప్రతిచర్యలకు దారితీసింది. బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తన లేఖలో, సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆమె కోరారు.

















