అమరావతి : తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయలసీమకు చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాట్ టాపిక్ గా మారాడు. తనపై లైంగిక వేధింపులు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు హల్ చల్ చేశాయి. సోషల్ మీడియాను షేక్ చేశాయి. బాధితురాలు సైతం బయటకు వచ్చింది. దీంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలం పాటు దూరంగా ఉండాలని సూచింది. కానీ ఇప్పటి వరకు తనపై చర్యలు తీసుకోలేదు. సరికదా తనను వెంటేసుకు వస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంది. ఈ తరునంల ఉన్నట్టుండి ఎమ్మెల్యే తాను సుద్దపూసనని, తనకు ఏపాపం తెలియదని , తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియోలు, ఫోటోలు ఉన్నాయంటూ వాపోయాడు.
ఆపై వాటిని సర్కులేట్ చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అమరావాతిలోని హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. తన తరపున న్యాయవాది పిటిషన్ద దాఖలు చేశారు.
గోప్యతా హక్కు ఉల్లంఘించ బడుతోందని దావాలో పేర్కొన్నారు. అరవ శ్రీధర్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోల వ్యాప్తిని నిరోధించాలని కోర్టును కోరారు . ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటునన్నారు రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ (జేఎస్పీ) ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ప్రసార ఛానెళ్లు , సోషల్ మీడియా నుండి తన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు, సంబంధిత మెటీరియల్ మొత్తాన్ని తొలగించాలని కోర్టును కోరారు. తన పిటిషన్‌లో, వివిధ టెలివిజన్ ఛానెళ్లు , డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం అవుతున్న కంటెంట్ తన ప్రతిష్టకు పూడ్చలేని నష్టం కలిగిస్తోందని ఎమ్మెల్యే వాదించారు.
















