Jajula Srinivas Goud : హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు ఇచ్చే 42 శాతం రిజర్వేషన్ ను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud). మాధవ రెడ్డి, గోపాల్ రెడ్డి బీసీ ద్రోహులని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు అడ్డు కోవడానికి రెడ్డి సంఘంకు ఉన్న అర్హత ఏమిటో చెప్పాలని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న రెడ్డి సంఘంపై అఖిలపక్ష పార్టీలు తమ వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ రిజర్వేషన్లు రక్షించడం కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు.
Jajula Srinivas Goud Shocking Comments
ఈనెల 7న ఫూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని వెల్లడించారు. బీసీలకు న్యాయబద్ధంగా రావలసిన 42 శాతం రిజర్వేషన్లను రెడ్డి సంఘం పేరుతో మాధవరెడ్డి, గోపాల్ రెడ్డిలు అనేక కుట్రలు కుతంత్రాలతో అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా అగ్గి రాజేస్తారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి నష్టం లేనప్పటికీ బీసీ రిజర్వేషన్లను ఎలాగైనా అడ్డుకొని తీరాలని తెర వెనుక ఎంతోమంది అగ్రకుల శక్తులు కుటీల ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆరోపించారు.
Also Read : BC Janardhan Reddy Important Update : అవుకు రిజర్వాయర్ సమస్యను పరిష్కరిస్తాం

















