Jajula Srinivas Goud : భువనగిరి జిల్లా : 42 శాతం బిసీ రిజర్వేషన్ అమలు కోసం బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud). భువనగిరి జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్ , రాష్ట్రపతి అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. బీసీ ప్రధానిగా ఉండి ఓసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత మోది కే దక్కిందన్నారు. ఎన్నికలప్పుడే మోడీకి బీసీలు గుర్తుకొస్తారంటూ ఆరోపించారు. గత 12 సంవత్సరాల బిజేపి పాలనలో బీసీలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. మొన్న జరిగిన పార్లమెంటు సమావేశంలో రాహుల్ గాంధీ బీసీల గురించి మాట్లాడక పోవడం విచారకరం అన్నారు. చీము నెత్తురు ఉంటే 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం బీసీ ప్రజా ప్రతినిధులు రాజినామ చేయాలని డిమాండ్ చేశారు.
Jajula Srinivas Goud Shocking Comments
దసరా తర్వాత భువనగిరిలో లక్ష మంది తో బీసీల సింహ గర్జన మహాసభ నిర్వహిస్తామని ప్రకటించారు జాజుల శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం లో42 శాతం రిజర్వేషన్లు సాధించటానికి రాజకీయ పార్టీలకతీతంగా బీసీలంతా కలసి రావాలని కోరారు. స్థానిక ఎన్నికలతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. చట్టంతో పాటు ఆర్డినెన్స్ కూడా చేయటం పట్ల ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ పార్టీలది గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాటగా ఉందంటూ ఎద్దేవా చేశారు. నెల రోజులు పార్లమెంటు సమావేశాలు జరిగితే రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్ మీద ఒక్క మాట కూడా మాట్లాడ లేదని మండిపడ్డారు. ఇదేమి రాజకీయం అంటూ ప్రశ్నించారు.
Also Read : Popular Festival Dussehra-Minister Anam : దసరా మహోత్సవాలకు భారీగా ఏర్పాట్లు
