జ‌గ‌న్ రెడ్డి బాధితుడు కాదు నిందితుడు : ప‌య్యావుల కేశ‌వ్

మాజీ సీఎం కామెంట్లపై ఘాటుగా స్పందించిన మంత్రి

hellotelugu-PayyavulaKeshav

అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం వేసింది వైఎస్ ఫ్యామ్లీ అయితే జగన్ దాన్ని కొనసాగిస్తున్నాడ‌ని ఆరోపించారు. జగన్ అరాచక రాజకీయాలపై యువత ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్ బాధితుడు కాదు నిందితుడంటూ పయ్యావుల సీరియస్ వ్యాఖ్యలు చేశారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తాడంటూ ఎద్దేవా చేశారు. గతంలో నన్ను సన్మానించాలని అన్నాడు… నిన్నటికి నిన్న తనంత మంచోడు లేడని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడని మండిప‌డ్డారు ప‌య్యావుల కేశ‌వ్. వివేకా హత్య కేసులో ఏం జరిగిందో నిక్కరు వేసుకున్న కుర్రాడు కూడా చెబుతాడని మండిప‌డ్డారు.

అలాంటి వాటిల్లో కూడా జగన్ అసత్యాలు చెబుతుండ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. వైఎస్ కుటుంబంతోనే రాజకీయాలు నేరమయ్యాయి… రాజకీయాల్లోకి ఫ్యాక్షన్ తెచ్చారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆర్థిక మంత్రి. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీమలో ఫ్యాక్షనిజానికి అండగా నిలిచిందన్నారు..
నాటి ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో పార్నపల్లి అనే గ్రామంలో టీడీపీకి భారీ మెజార్టీ వచ్చిందన్నారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేతల ఇళ్లకు డ్రిల్ చేసి డైనమేట్లు పెట్టి పేల్చారు.. ఇదీ రాజారెడ్డి చరిత్ర అని ఫైర్ అయ్యారు. ఓ ఇంటిని డైనమేట్లు పెట్టి పేల్చేసిన ఘటనను ఇప్పటికీ ఎవ్వరూ మరిచి పోలేదన్నారు.

తన ప్రత్యర్థుల మీద దాడి చేయించి.అదే సందర్భంలో వేరే చోట ఉన్నట్టు ఎలిబీ సృష్టించుకోవడం అనేది వైఎస్ ఫ్యామ్లీతోనే మొదలైంద‌న్నారు ప‌య్యావుల కేశ‌వ్. లింగాల మండలంలో ముగ్గురు టాప్ లీడర్లను భయానకం సృష్టించి లొంగదీసుకున్నార‌నేది నిజం కాదా అని ప్ర‌శ్నించారు. రాజారెడ్డి నుంచి మొదలుకుని పులివెందులలో జరిగిన ఘటనలపై పుస్తకం వేస్తాం అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక సీమలో ఫ్యాక్షన్ను కంట్రోల్లోకి వచ్చిందన్నారు. వైఎస్ ఫ్యామ్లీ మొదలు పెట్టిన ఫ్యాక్షన్ రాజకీయాలను కంట్రోల్ చేయడానికి 30 ఏళ్లు పట్టిందని చెప్పారు.

Exit mobile version