Minister Atchannaidu Fired on Jagan : రాజ‌కీయాల‌కు జ‌గ‌న్ అన‌ర్హుడు : అచ్చెన్నాయుడు

అత్యంత అస‌మ‌ర్థ‌మైన సీఎంగా నిలిచి పోయాడు

Hello Telugu - Minister Atchannaidu Fired on Jagan

Hello Telugu - Minister Atchannaidu Fired on Jagan

Minister Atchannaidu : అమ‌రావ‌తి – పాలిటిక్స్ కు జ‌గ‌న్ రెడ్డి ప‌నికి రాడంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). అస‌మ‌ర్థ సీఎంగా నిలిచి పోయాడ‌ని, వైసీపీ గాలికి పుట్టిన పార్టీ అంటూ ఎద్దేవా చేశారు.
గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌ద్యాన్ని త‌యారు చేయించి అమ్మింది నువ్వు కాదా అంటూ ప్ర‌శ్నించారు. లెక్క‌లు చూప‌కుండా రూ. 32 వేల కోట్లు దోచుకున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న పాల‌నా కాలంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురైన‌ట్లు వాపోయారు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీని 11 సీట్ల‌కే ప‌రిమితం చేశారంటూ మండిప‌డ్డారు అచ్చెన్నాయుడు.

Minister Atchannaidu Slams Ex CM Jagan

2024 ఎన్నికలు కురుక్షేత్రాన్ని గుర్తు చేశాయ‌న్నారు. జగన్ రెడ్డి (YS Jagan) మీద తిరుగుబాటు చేసిన రాష్ట్ర ప్రజలు, ఎన్డీయే కూటమి పార్టీలకు పట్టం కట్టారని అన్నారు. కక్ష కట్టి సీఎం చంద్రబాబు నాయుడుని , త‌న‌ను మాన‌సికంగా హింసించార‌ని, చివ‌ర‌కు జైలుకు పంపించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఏపీ రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్ళిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి ఆక్సిజన్ అందుతోంద‌న్నారు మంత్రి కింజార‌పు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుచా తప్పకుండా అమలు చేస్తున్నామ‌న్నారు. ఫించన్లు పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం పథకాలు అంద చేశామ‌ని చెప్పారు. ఆగస్ట్ 15 న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు, ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సాయాన్ని అందచేస్తామ‌న్నారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ నగదు జమ అవుతుందని స్ప‌ష్టం చేశారు.

పొగాకు, మామిడి, కోకో పంటలు అధిక దిగుబడులు సాధించాయని, మద్దతు ధర కల్పించి రైతులకు అండ‌గా నిలబడ్డామ‌న్నారు. అద్దంకి నియోజకవర్గం పర్యటనలో భాగంగా మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Also Read : UPI Service Block Shocking : 4 రోజులు యూపీఐ సర్వీసులు నిలిపివేస్తున ఆ బ్యాంకులు

Exit mobile version