ధర్మశాల : ఐపీఎల్ మెగా టోర్నీ ఆసక్తికరంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 మ్యాచ్ లలో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకు వెళ్లింది. తన బెర్తును కన్ ఫర్మ్ చేసుకుంది. ఇక మిగతా మూడు జట్లు ఏవి వస్తాయనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ఇంకా మ్యాచ్ లు కొనసాగాల్సి ఉంది. ఇప్పటికే ఆర్సీబీపై విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులోకి వెళ్లాలని అనుకున్న పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లింది బెంగళూరు. ముందుగా మైదానంలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 రన్స్ చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరి లోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. తనకు తోడుగా మరోసారి సత్తా చాటాడు విరాట్ కోహ్లీ. ఇద్దరూ కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచేలా చేశారు. అయ్యర్ 40 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 4 సిక్సర్లతో 73 రన్స్ చేసి నాటౌట్ గా నిలిస్తే కోహ్లీ 37 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 58 పరుగులు చేయడంతో భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీకి ఇది 9వ విజయం కాగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు ఇది వరుసగా ఆరోసారి. భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ లో శశాంక్ సింగ్ 27 బంతుల్లో 56 ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేక పోయాడు. ఆర్సీబీ బౌలర్లలో మరోసారి సత్తా చాటారు సలామ్ 36 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే భువనేశ్వర్ కుమార్ 38 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.
