ITR Filing : ఇటీవలి కాలంలో డిజిటల్ వ్యవహారాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాల పెరుగుదల కూడా అనివార్యంగా మారింది. ఈ క్రమంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఫిషింగ్ స్కాముల ముప్పు ఎదుర్కొంటున్నారని ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) హెచ్చరించింది. పన్నుదారుల వ్యక్తిగత వివరాలను చోరీ చేయడానికి మోసగాళ్లు నకిలీ ఇమెయిళ్లు పంపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ITR Filing – ఫిషింగ్ స్కామ్ అంటే ఏమిటి?
ఫిషింగ్ అనేది మోసపూరిత చర్య. ఇందులో మోసగాళ్లు ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) వంటి అధికారిక సంస్థల పేరును వాడుతూ నకిలీ ఇమెయిళ్లు పంపిస్తారు. వాటిలో వ్యక్తిగత సమాచారం — బ్యాంక్ ఖాతా నంబర్లు, పాస్‌వర్డ్‌లు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు — అడుగుతారు. ఈ ఇమెయిళ్లు నిజమైనవిగా కనిపించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడతాయి.
పన్ను చెల్లింపుదారులకు సూచనలు:
ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ మీ వ్యక్తిగత డేటా కోసం ఇమెయిల్ ద్వారా అడగదు.
– PIN, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు, కార్డ్ నంబర్లు అడగడం జరగదు.
రీఫండ్‌లు, వెరిఫికేషన్‌ల కోసం లింక్‌లు లేదా అటాచ్‌మెంట్‌లు పంపించదు.
– అలాంటి లింక్‌లను క్లిక్ చేయకండి, డౌన్‌లోడ్ చేయవద్దు.
తెలియని ఇమెయిళ్లను నమ్మవద్దు.
- వాటికి ప్రతిస్పందించకండి.
- లింక్‌లు కాపీ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేయకండి. అవి నకిలీ వెబ్సైట్లు కావొచ్చు.
అధికారిక నోటీసుల గుర్తింపు ఎలా?
- ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చే ప్రతి అధికారిక నోటీసు Document Identification Number (DIN) కలిగి ఉంటుంది.
- ఈ నోటీసులు అధికారిక ఇ-ఫైలింగ్ పోర్టల్ (https://www.incometax.gov.in) ద్వారా అందుబాటులో ఉంటాయి.
నకిలీ ఇమెయిళ్లపై ఎలా స్పందించాలి?
- నిజమైన ఆదాయపు పన్ను శాఖ ఇమెయిళ్లు ఎప్పుడూ @incometax.gov.in డొమెయిన్ నుంచే వస్తాయి.
- అనుమానాస్పద ఇమెయిళ్లు వస్తే వెంటనే webmanager@incometax.gov.in లేదా incident@cert-in.org.in కు ఫార్వర్డ్ చేయండి.
- విచారణ కోసం పంపిన తర్వాత, ఆ ఇమెయిల్‌ను మీ ఇన్‌బాక్స్ నుంచి తొలగించండి.
పన్ను చెల్లింపుదారుల కోసం సూచనలు:
- మీ ఇ-ఫైలింగ్ ఖాతాను తరచుగా తనిఖీ చేయండి.
- ఎలాంటి సందేహాలైనా ఉన్నా, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా నేరుగా ఆదాయపు పన్ను శాఖను సంప్రదించండి.
జాగ్రత్త వహించండి – మోసాలకు దూరంగా ఉండండి. సైబర్ భద్రతలో సావధానతే రక్షణ.
Also Read : Indian Railways Growth : రైల్వే సర్కార్ శుభవార్త..ఇకపై తత్కాల్ టికెట్ కు నో ఆధార్
