Italian Ambassador Important Meeting : ఏపీ సీఎంతో ఇట‌లీ రాయ‌బారి భేటీ

విశాఖ‌ప‌ట్నంలో సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు

Hello Telugu - Italian Ambassador Important Meeting

Italian Ambassador : విశాఖ‌పట్నం : ఏపీ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు ముందు రోజు పెద్ద ఎత్తున కంపెనీల ప్ర‌తినిధులు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ మేర‌కు తైవాన్ కు చెందిన దిగ్గ‌జ కంపెనీలతో అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా కుప్పంలో ఇండస్ట్రియ‌ల్ పార్కు ఏర్పాటు చేయ‌నున్నారు. దీని వ‌ల్ల 50 వేల మందికి ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్షంగా ఉపాధి ల‌భించ‌నుంది. ఇదిలా ఉండ‌గా గురువారం భాగస్వామ్య సదస్సు సందర్భంగా నేపాల్‌, ఇటలీ రాయబారి (Italian Ambassador) ఆంటోనియో ఎన్రికో బార్టోలి హెచ్ ఈ నారా చంద్ర‌బాబు నాయుడుతో క‌లిశారు.

Italian Ambassador Meet CM Chandrababu

ఆంధ్రప్రదేశ్ ఇటలీ మధ్య సహకారం కోసం ఆటోమోటివ్ రంగం, ఆటో భాగాలు, యంత్రాలు, తయారీ, శక్తి, ఫ్యాషన్, ఆహార ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల గురించి విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యంత్రాలు, పునరుత్పాదక శక్తి , నౌకా నిర్మాణంలో భాగస్వామ్యాలను అన్వేషించమని ఇటాలియన్ కంపెనీలను తాను ఆహ్వానించడం జ‌రిగింద‌ని ఈ సంద‌ర్బంగా వెల్ల‌డించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. దీర్ఘకాలిక వాణిజ్యం , పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఇటాలియన్ ఇండస్ట్రియల్ క్లస్టర్‌ను అభివృద్ధి చేసే అవకాశాన్ని కూడా ప‌రిశీలించాల‌ని సూచించిన‌ట్లు తెలిపారు. సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సులో రూ 10 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని అంచ‌నా వేశామ‌న్నారు.

Also Read : CM Chandrababu Important Update : గ్రీన్ ఎన‌ర్జీ ప్రాధాన్యం మ‌రింత పెరిగింది : చంద్ర‌బాబు

Exit mobile version