CM Chandrababu : విశాఖపట్నం : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపు, ఎల్లుండి విశాఖ నగరం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గురువారం సీఎం వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యం గణనీయంగా పెరిగిందని చెప్పారు. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో ఏపీ బలంగా ఉందన్నారు చంద్రబాబు నాయుడు. అయితే గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగునంగా తాము 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు సీఎం.
CM Chandrababu Key Comments
ఈ మేరకు దీనిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన పరిశ్రమలకు సంబంధించి కేవలం 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. దీని వల్ల ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా చేయడం జరిగిందని చెప్పారు. అంతే కాదు ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ అమెరికా వెలుపల ఏపీలోని విశాఖలో అతి పెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోందన్నారు. అంతే కాకుండా సబ్ సీ కేబుల్ కూడా ఇక్కడి నుంచే ఏర్పాటు కానుందని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు. గతంలో తాము ఐటీ రంగాన్ని ప్రోత్సహించామని గుర్తు చేశారు. దీని కారణంగా పెద్ద ఎత్తున సంబంధిత రంగానికి చెందిన సంస్థలు తమ వైపు చూస్తున్నాయని అన్నారు. ఇవాళ బిగ్ కంపెనీలకు మన భారతీయులే నాయకత్వం వహిస్తుండడం తమకు గర్వంగా ఉందన్నారు సీఎం.
Also Read : ATC Police Shocking Investigation : హైదరాబాద్ లో ఏటీసీ పోలీసుల తనిఖీలు
