Israel PM : వాషింగ్టన్/తెల్‌అవీవ్: అమెరికా జరిపిన అణు స్థావరాలపై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ (Benjamin Netanyahu) స్పందించారు. ఇరాన్‌పై అమెరికా తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో చేపట్టిన ఈ దాడులు విజయవంతమయ్యాయని, ఇది చరిత్రను మలుపు తిప్పే చర్యగా నిలుస్తుందని నేతన్యాహూ అన్నారు.
Israel PM Praises
ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో నేతన్యాహూ మాట్లాడుతూ –
“బలమైన శక్తి ద్వారానే శాంతి సాధ్యం. ఈ మాటను ట్రంప్, నేను ఎన్నోసార్లు చెప్పాం. నేడు అమెరికా అది మరోసారి రుజువు చేసింది. ప్రపంచంలో మరే దేశం చేయలేని సాహసాన్ని అమెరికా చేసి చూపించింది. అణు ఆయుధాలు అత్యంత ప్రమాదకర పాలకుల చేతిలో పడకుండా అమెరికా తీసుకున్న ఈ చర్య చరిత్రలో నిలిచిపోతుంది” అని పేర్కొన్నారు.
అమెరికా చేపట్టిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” లో భాగంగా ఇరాన్‌లోని ఫర్డూ, నాటనాజ్, ఎస్ఫహాన్ అణు కేంద్రాలపై భారీ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో బంకర్ బస్టర్ బాంబులు, టామహాక్ క్షిపణులు ఉపయోగించినట్టు అమెరికా అధికారికంగా వెల్లడించింది.
అంతేగాక దాడుల అనంతరం అన్ని అమెరికా ఫైటర్ జెట్లు సురక్షితంగా తిరిగివచ్చాయని ట్రంప్ ప్రకటించారు.
“ఈ విజయానికి కారణమైన అమెరికన్ వీరులకు అభినందనలు. ఇది ప్రపంచదేశాల కోసం ఒక గుణపాఠం” అని ట్రంప్ చెప్పారు.
ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కొనసాగుతున్న టెర్షన్‌కు మధ్య అమెరికా కూడా నేరుగా రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత సంక్షోభానికి దారితీయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ పరిణామాలపై రష్యా, చైనా వంటి దేశాల స్పందన ఎలా ఉంటుందన్నది అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read : CM Chandrababu Interesting : రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా విశాఖను తీర్చిదిద్దుతాం
