సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల ప‌రిశీల‌న

మే 19,20 తేదీల‌లో కుప్పంలో నాయుడు టూర్

hellotelugu-APCMTour

చిత్తూరు జిల్లా : ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. త‌న టూర్ కార‌ణంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడ్ ఆధ్వ‌ర్యంలో. మే 19,20వ తేదీల‌లో జిల్లా లోని కుప్పంలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే వెల్ల‌డించారు సీఎస్ . ఇదిలా ఉండ‌గా కుప్పం పట్టణంలో జరగనున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారి దర్శనానికి రానున్నారు. జిల్లా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏఎస్ఎల్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి తో పాటు జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ పాల్గొని సీఎం ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన హెలి ప్యాడ్ , సీఎం నివాస ప్రాంతం, గంగ‌మ్మ గుడి ప్ర‌దేశాల‌ను ప‌ర్య‌వేక్షించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు, అగ్ని మాపక చర్యలు, బారికేడింగ్, వైద్య సేవల సమకూర్పు, రూట్ మ్యాప్ లభ్యత, ట్రాఫిక్ నియంత్రణ, జనసామూహిక నియంత్రణ చర్యలపై పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ అవసరమైన సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటించే గంగమ్మ దేవాలయం, నివాసం ఉండే కడపల్లె ప్రాంతం వంటివి ప్రత్యేక భద్రతా ప్రాంతాలుగా గుర్తించి సమగ్ర పరిశీలన చేప‌ట్టారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు పోలీసులు ప్రతి స్థాయిలో సమన్వయంతో పని చేస్తూ అన్ని విభాగాలతో సమర్థవంతమైన ప్రణాళికను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫైర్ సర్వీసులు, ఆరోగ్య సేవలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పోలీస్ బందోబస్తు, డ్రోన్ మానిటరింగ్, విఐపి మూమెంట్స్ వంటి అంశాల్లో ఎటువంటి లోటు లేకుండా ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు.

Exit mobile version