INDW vs SLW : అస్సాం : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీలో తొలి మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది భారత (India) మహిళా జట్టు. తన సమీప ప్రత్యర్థి శ్రీలంక మహిళా జట్టును 59 పరుగుల తేడాతో ఓడించింది. వర్షం అంతరాయం కలిగించినా తర్వాత ఆట సాగింది. అంతకు ముందు అస్సాం భూమి పుత్రుడు, అమర గాయకుడు జుబీన్ గార్గ్ కు ఘనంగా నివాళులు అర్పించింది బీసీసీఐ (BCCI). ఇక మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది టీమిండియా. సూపర్ ఫామ్ లో కొనసాగుతున్న స్టార్ క్రికెటర్ స్మృతీ మందన్నా ఊహించని రీతిలో షాట్ కొట్టబోయి వికెట్ పారేసుకుంది. ఒకానొక దశలో 27 ఓవర్లలో 6 కీలకమైన వికెట్లు కోల్పోయి 126 రన్స్ చేసిన తరుణంలో దీప్తి శర్మ, కౌర్ కలిసి 7వ వికెట్ కు 99 బంతుల్లో 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
INDW vs SLW Updates
దీప్తి శర్మ 53 బంతుల్లో 53 రన్స్ చేసింది. అంతే కాకుండా తను బౌలింగ్ పరంగా కూడా రాణించింది. 10 ఓవర్లు వేసి 54 రన్స్ ఇచ్చి కీలకమైన మూడు వికెట్లను కూల్చింది. అమన్‌జోత్ కౌర్ 56 బంతుల్లో 57 పరుగులు చేసి ఆరు ఓవర్లలో 1-37 స్కోరు సాధించింది. వర్షం కారణంగా రెండు ఇన్నింగ్స్‌లలో మూడు ఓవర్ల తేడాతో ఆట నిలిచి పోయిన తర్వాత భారత్ 47 ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 269 పరుగులతో భారీ స్కోర్ సాధించింది. అనంతరం 270 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ చమరి అటపట్టు 47 బంతుల్లో 43 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లలో స్నేహ రాణా 32 రన్స్ ఇచ్చి 2 వికట్లు తీయగా శ్రీ చరణి 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇక టీమిండియా రెండో మ్యాచ్ దాయాది పాకిస్తాన్ తో శ్రీలంకతో తలపడనుంది.
Also Read : CM Chandrababu Important Update : పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్ : సీఎం
