CM Chandrababu Important Update : పెట్టుబడులకు స్వ‌ర్గధామం ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎం

సీఐఐ పార్టనర్షిప్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో చంద్రబాబు

Hello Telugu - CM Chandrababu Important Update

Hello Telugu - CM Chandrababu Important Update

CM Chandrababu : ఢిల్లీ : భారతదేశంలో పెట్టే పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్ప‌ష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులిస్తామని తెలిపారు. వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను అంది పుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి చంద్రబాబు హాజరయ్యారు. నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను, వివిధ దేశాల రాయబారులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖలో నిర్వహించే 30వ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక వేత్తలను, వివిధ దేశాల రాయబారులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం అని చెప్పారు.

CM Chandrababu key Comments

నవంబరు 14, 15వ తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. పరిశ్రమలకు అనువుగా ఉండేలా లాజిస్టిక్స్ ను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల నిర్మాణం చేపడుతున్నాం. సంపద సృష్టికి పెట్టుబడులు రావాలన్నారు చంద్ర‌బాబు నాయుడు. సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలించగలం అని అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపోందిస్తే.. మేం స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామ‌ని పేర్కొన్నారు . ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర విజన్ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. దీని కోసం 10 సూత్రాలను ఆధారంగా చేసుకుని పని చేస్తున్నామ‌ని తెలిపారు. లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ, ప్రాడెక్టు పర్ఫెక్షన్ లాంటి కీలకమైన లక్ష్యాలను పెట్టుకున్నామ‌న్నారు. సమీకృత అభివృద్ధి అనేది ఇప్పుడు ఓ నినాదం… పీ4 ద్వారా సమీకృత అభివృద్ధి సాధ్యం అవుతుంద‌న్నారు సీఎం. స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, ఏరోస్పేస్ సిటీలను ఏపీలో ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు.

Also Read : Gandhi statue vandalize Shocking : లండన్ లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

Exit mobile version