పైల‌ట్లు, సిబ్బంది కొర‌త వ‌ల్లే ఇండిగో ఫ్లైట్స్ ర‌ద్దు

ప్ర‌యాణీకులు మ‌న్నించాల‌ని కోరిన సీఈఓ

hellotelugu-IndigoCEO

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఆయా విమానాశ్ర‌యాల‌లో ఇండిగో ఫ్లైట్స్ అర్దాంత‌రంగా నిలిచి పోయాయి. దీంతో ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన అసౌక‌ర్యంపై స్పందించారు ఇండిగో సంస్థ సీఈఓ పీట‌ర్ ఎల్బ‌ర్స్ స్పందించారు. సారీ చెబుతూ వీడియో విడుదల చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామ‌ని అన్నారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది, పైలట్ల కొరత వల్లే విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందని స్ప‌ష్టం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామ‌ని అన్నారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో డీజీసీఏ స‌డ‌లింపులు ఇవ్వ‌డం ప‌ట్ల ధ‌న్య‌వాదాలు తెలిపారు. త్వ‌ర‌లోనే సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు సీఈఓ.

ఇదిలా ఉండ‌గా ఆయా ఎయిర్ పోర్టుల‌లో బ‌య‌లు దేరాల్సిన ఇండిగో విమానాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాదాపు 1,000కి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. జ‌రిగిన అసౌకర్యానికి మ‌న్నించాల‌ని కోరారు . క‌స్ట‌మ‌ర్ల‌కు క‌మ్యూనికేష‌న్ చేర వేశామ‌ని తెలిపారు. సిబ్బందితో పాటు పైలట్ల కొర‌త చాలా ఉంది. దీనిని అధిగ‌మించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు సిఇఓ. ఇప్ప‌టికే ఇండిగో విమానాలలో ప్ర‌యాణం చేసేందుకు ముంద‌స్తుగా బుకింగ్ చేసుకున్న వారంద‌రికీ త‌మ ప్ర‌యాణాల‌ను మానుకోవాల‌ని, లేదా తేదీల‌ను మార్చుకోవాల‌ని కూడా కోర‌డం జ‌రిగింద‌న్నారు. దీని వ‌ల్ల ఇబ్బంది ఎదుర్కొనే ప్ర‌మాదం నుంచి వెసులుబాటు క‌లుగుతుంద‌న్నారు.

Exit mobile version