అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ నిర్వాకంపై. సమయం ఇచ్చినప్పటికీ డీజీసీఏ నిర్దేశించిన ప్రమాణాలను పాటించ లేదని పేర్కొన్నారు. దీని కారణంగానే విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారని అన్నారు. క్షమాపణలు చెప్పినా ప్రయాణీకులకు అసౌకర్యం కలిగిందన్నారు. ప్రధానంగా విమానాలను నడిపే పైలట్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా తన హెలికాప్టర్ కు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తన హెలికాప్టర్ కూడా నిబంధననల మేరకే కొన్ని గంటలే ప్రయాణం చేస్తుందని చెప్పారు సీఎం. అయితే ఇండిగో సంక్షోభాన్ని కేంద్ర సర్కార్ త్వరలోనే పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సర్కార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, విమాన ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ఆయా ఎయిర్ పోర్టులలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని చెప్పారు. స్లీపర్ బస్సులలో తమ తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఈ సమస్యకు ప్రధాన కారణం ఇండిగో సంస్థేనని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు.

















