ఇండియా రికార్డ్ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విక్ట‌రీ

స‌త్తా చాటిన భార‌తీయ ఆట‌గాళ్లు

hellotelugu-TeamIndiaWin

అహ్మ‌దాబాద్ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త్ వ‌శ‌మైంది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ విశ్వ విజేత‌గా నిలిచింది. చెప్పి మరీ సాధించింది. నిన్న‌టి దాకా తీవ్ర విమర్శ‌లు ఎదుర్కొన్న కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ దుమ్ము రేపాడు. తానే భార‌త్ కు దిక్కు అయ్యాడు. విండీస్ తో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో అడ్డు గోడ‌లా నిల‌బ‌డ్డాడు. త‌ను ఒక్క‌డే 97 ప‌రుగులు చేసి విజ‌య తీరాల‌కు చేర్చాడు టీమిండియాను. ఇదే స‌మ‌యంలో సెమీస్ కు చేర్చాడు. అంతేనా ఆగ‌లేదు. త‌న ప‌ర్ ఫార్మెన్స్ ను కొన‌సాగించాడు. ముంబై వేదిక‌గా జ‌రిగిన సెమీస్ లో సైతం స‌త్తా చాటాడు.

త‌ను ఒక్క‌డే 89 ర‌న్స్ చేశాడు. ఇక ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త్ భారీ స్కోర్ చేసింది. కేవ‌లం 5 వికెట్లు కోల్పోయి 255 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఈసారి కూడా సంజూ శాంస‌న్ స‌త్తాచాటాడు. మ‌రోసారి దంచి కొట్టాడు. త‌ను 89 ప‌రుగులు చేశాడు. అభిషేక్ శ‌ర్మ 52 ర‌న్స్ చేస్తే ఇషాన్ కిష‌న్ 54 ర‌న్స్ తో దంచి కొట్టాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన శివ‌మ్ దూబే 8 బంతులు ఎదుర్కొని 26 ర‌న్స్ చేశాడు. అనంత‌రం 256 ప‌రుగుల భారీ స్కోర్ ను ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ప్ర‌త్య‌ర్థి న్యూజిలాండ్ ఏ కోశానా ధీటుగా ఆడ‌లేక పోయింది. 19 ఓవ‌ర్ల‌లోనే 159 ప‌రుగుల‌కే ఆల్ అవుట్ అయ్యారు.

Exit mobile version