ఫైన‌ల్ లో గెలిచేందుకు భార‌త్ పిచ్ ట్యాంప‌రింగ్

మాజీ క్రికెట‌ర్ నాసీర్ హుస్సేన్ కామెంట్స్

hellotelugu-NassserHussain

ఇంగ్లండ్ : అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇవాళ కీల‌క‌మైన న్యూజిలాండ్, భార‌త జ‌ట్ల మ‌ధ్య కీల‌క‌మైన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో త‌ల‌ప‌డ‌నుంది. ఇండియా క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో విండీస్ పై 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీస్ లో ఇంగ్లండ్ పై 7 ప‌రుగుల తేడాతో విజ‌యం న‌మోదు చేసింది. ఈ సంద‌ర్బంగా కీల‌క‌మైన మ్యాచ్ లో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇదిలా ఉండ‌గా అహ్మ‌దాబాద్ పిచ్ గురించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసీర్ హుస్సేన్ . త‌ను ఓ పాడ్ కాస్ట్ లో స్పందిస్తూ అహ్మ‌దాబాద్ పిచ్ పై నోరు పారేసుకున్నాడు. త‌న‌లోని అక్క‌సునంతా వెళ్ల‌గ‌క్కాడు.

T20 ప్రపంచ కప్ ఫైనల్ కోసం అహ్మదాబాద్‌లో జరిగిన పిచ్ ట్యాంపరింగ్ జ‌రిగిందేమోన‌న్న అనుమానం వ్య‌క్తం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. పిచ్‌ను భారతీయులకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని నాకు వార్తలు వచ్చాయని తెలిపాడు. ప్రజలు తెల్లవారుజామున 1 లేదా 2 గంటలకు స్టేడియం వెలుపల కూడా ఉన్నారు, పిచ్‌ను ఏదో చేస్తున్నారు! వారు అక్షరాలా పిచ్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నారు. అది అక్కడితో ఆగదు, టాస్ సమయంలో కూడా వారు ప్రభావితం చేయాలని ప్లాన్ చేస్తున్నారని నేను విన్నానని అన్నాడు నాసీర్ హుస్సేన్. బంతుల్లో చిప్స్ గురించి పుకార్లు ఉన్నాయి, నిజంగా అనుమానాస్పదంగా ఏదో జరుగుతోందని అన్నాడు. ఇది క్రికెట్ కాదు, ఇది తారుమారు. ఆట స్ఫూర్తిని ముఖం మీద కొట్టివేస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే, ప్రపంచ కప్ భారతదేశంలో ఉండకూడదు, శ్రీలంకలో ఉండాలన్నాడు.

Exit mobile version