Indian Railways New Innovation : ఈ టికెట్ కొంటె 20 శాతం డిస్కౌంట్ అంటున్న రైల్వేశాఖ

తిరుగు ప్రయాణ ఛార్జీపై 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది...

Hello Telugu - Indian Railways New Innovation

Hello Telugu - Indian Railways New Innovation

Indian Railways : పండుగల సీజన్‌లో రైళ్లలో ప్రయాణించేవారికి భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు మరియు టికెట్ పొందడాన్ని మరింత సులభతరం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, రైల్వే (Indian Railways) శాఖ “రౌండ్ ట్రిప్ ప్యాకేజీ” అనే కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా, ఒకే వ్యక్తి ఒకే తరగతి టిక్కెట్లతో అప్‌ మరియు డౌన్‌ ప్రయాణాల కోసం టికెట్లు బుక్‌ చేసుకుంటే, తిరుగు ప్రయాణ ఛార్జీపై 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Indian Railways – పథకానికి అనుగుణమైన షరతులు:

ఎవరెవరు లాభపడతారు?

ఈ పథకం అన్ని తరగతుల రైళ్లకు, ప్రత్యేక రైళ్లకు వర్తిస్తుంది. అయితే, ఫ్లెక్సీ ఫేర్ ఉన్న రైళ్లకు ఇది వర్తించదు. టికెట్లు రిజర్వేషన్ కౌంటర్ గానీ, IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా గానీ బుక్ చేయాలి. చార్ట్ ప్రిపరేషన్ సమయంలో ఛార్జీలో మార్పు వచ్చినా, అదనంగా డబ్బు వసూలు చేయరు.

రద్దీ నియంత్రణ లక్ష్యం

ఈ పథకం ద్వారా పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని వివిధ తేదీల్లో విభజించడమే లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా దీపావళి, దసరా లాంటి పెద్ద పండుగల సమయంలో ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉండేలా చూడడమే రైల్వే ఉద్దేశం.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, “ఈ పథకం ప్రయాణికులకు ఆర్థికంగా లాభదాయకమే కాకుండా, ప్రయాణ సౌకర్యం మెరుగుపడేలా చేస్తుంది. రెండు వైపులా ప్రయాణించే వారికి ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. స్టేషన్లలో, మీడియా ద్వారా ప్రచారం జరపాలని సంబంధిత అధికారులనుAlready దిశానిర్దేశం చేశాం” అని పేర్కొన్నారు.

Also Read : SBI Chairman Interesting Update : 10 శాతం వృద్ధి రేటుతో సంచలనం సృష్టించిన ఎస్బిఐ

Exit mobile version