Indian Railways New Innovation : రైళ్లలో రైల్‌నీర్‌ వాటర్‌ బాటిల్ ధరలు తగ్గింపు

డ్రింకింగ్ వాటర్‌ బాటిల్స్ ధరలను తగ్గిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

Hello Telugu - Indian Railways New Innovation

Hello Telugu - Indian Railways New Innovation

Indian Railways : రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో విక్రయించే రైల్‌నీర్‌ బ్రాండ్‌ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ బాటిల్స్ ధరలను తగ్గిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ (Indian Railways) నిర్ణయం తీసుకుంది.

Indian Railways – కొత్త ధరలు

ఇంతకు ముందు 1 లీటర్ బాటిల్ రూ. 15, హాఫ్ లీటర్ బాటిల్ రూ. 10 ధరకు లభించగా, సెప్టెంబర్ 22 సోమవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.

జీఎస్టీ తగ్గింపు ప్రభావం

తాజాగా జీఎస్టీ కౌన్సిల్ పలు వస్తు సేవలపై పన్ను తగ్గించడంతో, ఆ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇతర బ్రాండ్లకూ వర్తింపు

రైల్వే ప్రాంగణాలు, రైళ్లలో విక్రయించే ఇతర బ్రాండ్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్‌పై కూడా ఈ తగ్గింపు వర్తించనుంది. IRCTC/రైల్వేలు షార్ట్‌లిస్ట్ చేసిన వాటర్‌ బాటిల్స్ గరిష్ట రిటైల్ ధరను సవరించి 1 లీటర్‌కు రూ. 14, హాఫ్ లీటర్‌కు రూ. 9గా నిర్ణయించారు.

Also Read : Trump Shocking H-1B,H-4 Visa Holders : హెచ్-1బీ వీసా ఫీజులపై ట్రంప్ సంచలన నిర్ణయం

Exit mobile version