చ‌ద‌ల‌వాడ గ్రామంలో రూ. కోటితో 5 స్టార్ హోట‌ల్

శంకుస్థాప‌న చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

hellotelugu-NaraLokesh

అమ‌రావ‌తి : ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డిదారులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నార‌ని అన్నారు ఐటీ ,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. శుక్ర‌వారం సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పల పాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.కోటి పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్‌కు శంకుస్థాపన చేశారు. 100 కోట్ల ట‌ర్నోవ‌ర్ క‌లిగిన రవిశంకర్ గ్రూప్ , రవి ప్రియ హాస్పిటాలిటీస్ ఎల్‌ఎల్‌పి సంయుక్త భాగస్వామ్యం ద్వారా ఈ హోటల్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించేందుకు శ్రీ‌కారం చుట్టారు. ఒంగోలు ,పరిసర ప్రాంతాల్లో స్థాపించబడిన మొదటి 5-నక్షత్రాల హోటల్‌గా ఇది నిలుస్తుందని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్‌.

రవిశంకర్ గ్రూప్ చైర్మన్ ర‌వి శంక‌ర్ , మంత్రి డోలా బాల శ్రీ వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, ఏలూరి సాంబశివరావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉగ్ర నరసింహ రెడ్డి; ఇంటూరి నాగేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ , కలెక్టర్ రాజబాబు; టూరిజం ఏపీ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్. 20-పాయింట్ కమిటీ చైర్మన్ లంక దినకర్ఏ , ఏపీ కల్చరల్ కమిషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి; ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యం, మాజీ ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ; రవిశంకర్ గ్రూప్ సిబ్బంది; తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మంత్రి నారా లోకేష్. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మ‌రింత అభివృద్ది చెందుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Exit mobile version