Indian Govt : జూలై నెల మొదటి రోజుతో దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. పాన్ కార్డు, రైల్వే టికెట్లు, బ్యాంకింగ్, గ్యాస్ ధరలు, క్రెడిట్ కార్డుల లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి రావడం సాధారణ ప్రజలకు అనేక మార్పులను తీసుకురానున్నాయి. ఈ మార్పులపై ఓసారి పరిశీలిద్దాం.
Indian Govt – రైల్వే టికెట్ల చార్జీల పెంపు
మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్ ధరలు పెరిగాయి.
నాన్ ఏసీ డబ్బాలపై – కిలోమీటర్‌కు 1 పైసా చొప్పున అదనపు చార్జీ
ఏసీ తరగతుల్లో (3rd AC నుంచి 1st AC వరకు) – కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున ధరలు పెరుగుతాయి
దూరాన్ని బట్టి చార్జీల మార్పు ఉంటుంది
తత్కాల్ టికెట్ బుకింగ్ మార్పులు
ఇకపై తత్కాల్ టికెట్లు బుక్ చేసేందుకు
ఆధార్‌తో లింకైన IRCTC ఖాతా తప్పనిసరి
ఓటీపీ ఆధారిత ధృవీకరణ (అథెంటికేషన్) తప్పనిసరి
పాన్ కార్డు నిబంధనల మార్పు
కొత్తగా పాన్ కోసం దరఖాస్తు చేసే వారికి ఆధార్ కాపీ అందించడం తప్పనిసరి
ఇప్పటికే ఉన్నవారు పాన్, ఆధార్‌ను డిసెంబర్ 31, 2025లోగా లింక్ చేయాలి
ఆదాయపు పన్ను దాఖలు గడువు
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి జూలై 31, 2025 చివరి తేదీ
వివరాలు సమర్పించే కంపెనీలకు సెప్టెంబర్ 15, 2025 గడువు
క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో మార్పులు
అన్ని క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు ఇకపై భారత్ బిల్ పే (BBPS) ద్వారా మాత్రమే
గేమింగ్ ప్లాట్‌ఫాంలపై నెలకు ₹10,000కి మించిన ఖర్చుపై 1% అదనపు ఫీజు
బ్యాంకింగ్ చార్జీలు
ICICI, HDFC బ్యాంకులు నగదు విత్‌డ్రా నెలకు 5 సార్లు మాత్రమే ఉచితం
ఆ తర్వాతి లావాదేవీలపై అదనపు ఛార్జీలు
యూపీఐ ఆధారిత లావాదేవీలపై కూడా పరిమితులు, ఛార్జీలు ఉండే అవకాశం
గ్యాస్ ధరల్లో మార్పు
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు స్వల్పంగా తగ్గాయి
హోటళ్ళు, కమర్షియల్ యూనిట్లకు ఇది స్వల్ప ఊరటగా మారింది
అయితే డొమెస్టిక్ వంట గ్యాస్ ధరల్లో మార్పులు తక్షణంగా లేవు
జూలై 1 నుంచి అమలైన ఈ నూతన నిబంధనలు ప్రజల దైనందిన జీవితంపై ప్రభావం చూపనున్నాయి. ప్రయాణం, బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, ట్యాక్స్ ఫైలింగ్, గ్యాస్ వినియోగం ఇలా అన్ని రంగాల్లో కొత్త మార్గదర్శకాలు ప్రారంభమయ్యాయి.
Also Read : LPG Gas Cylinder Pride Drop : గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..భారీగా తగ్గుముఖం పట్టిన గ్యాస్ సిలిండర్ ధరలు
