India Railways Interesting Update : ప్రయాణికులకు దీపావళికి అదిరిపోయే బహుమతి

తొలిసారిగా స్లీపర్ కోచ్‌లతో రాత్రిపూట ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది...

Hello Telugu - India Railways Interesting Update

Hello Telugu - India Railways Interesting Update

India Railways : దేశ రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే (India Railways) దీపావళి సందర్భంగా మరొక శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ పండుగకు ముందే ట్రాక్‌పైకి రానుంది. ఢిల్లీ నుంచి భోపాల్, అహ్మదాబాద్, పాట్నా మార్గాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తొలిసారిగా స్లీపర్ కోచ్‌లతో రాత్రిపూట ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.

India Railways – ప్రయాణ సమయంపై భారీ తగ్గింపు

ప్రస్తుతం ఢిల్లీ–పాట్నా మార్గంలో రాజధాని, ఇతర రైళ్లు 13–17 గంటలు పడుతుంటే, వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌తో అదే ప్రయాణం కేవలం 11.30 గంటల్లో పూర్తవుతుంది. గంటకు 180 కి.మీ వేగంతో నడిచే ఈ రైలు సుదూర ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గిస్తుందని అధికారులు తెలిపారు. పండుగల సమయంలో పూర్వాంచల్, బీహార్‌కు వెళ్ళే ప్రయాణికులకు ఈ రైలు అదనపు సౌకర్యాన్ని కల్పించనుంది.

ఆధునిక సదుపాయాలతో ప్రత్యేక రైలు

ఈ రైలును భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) తయారు చేసింది. లోపలి డిజైన్ విమానాన్ని తలపించేలా ఉండగా, ఇందులో సీసీటీవీ కెమెరాలు, సెన్సార్ గేట్లు, ఎల్ఈడీ సమాచార స్క్రీన్‌లు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థ, ఆన్‌బోర్డ్ ప్రకటనలు వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ప్రయాణికులకు అత్యుత్తమ భద్రతతో పాటు విలాసవంతమైన అనుభవాన్ని అందించేలా రూపకల్పన చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

టికెట్ ధర కొంచెం ఎక్కువే కానీ..

రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ టికెట్ ధర 10–15 శాతం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే తక్కువ సమయం, అధిక సౌకర్యాలు, మెరుగైన భద్రత కారణంగా ఈ రైలు రాజధాని కంటే మెరుగైన ఎంపికగా నిలుస్తుందని పేర్కొన్నారు. విమాన టికెట్లతో పోలిస్తే ఇది ఆర్థికంగా కూడా మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Vice President Elections Interesting : ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఉత్సాహభరిత ఓటింగ్ – సాయంత్రానికే ఫలితాలు

Exit mobile version