India Post : ఢిల్లీ : భారత దేశ వ్యాప్తంగా విస్తృతమైన నెట్ వర్క్ కలిగిన ఏకైక భారతీయ సంస్థ ఇండియా పోస్టాపీస్ సంచలన ప్రకటన చేసింది. ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా డెలివరీ సేవలను వినూత్నంగా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా 24 గంటల లోపు, 48 గంటల లోపు ఈ సేవలు అందిస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ సేవలను జనవరి నుండి 24 గంటలు , 48 గంటల మెయిల్ డెలివరీ మరుసటి రోజు పార్శిల్ డెలివరీ ప్రారంభమవుతుందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా తెలిపారు. సమయ పాలనతో మెయిల్స్, పార్శిల్‌ల గ్యారెంటీ ఆధారిత సేవను ఇండియా పోస్ట్ (India Post) ప్రారంభిస్తుందని సింధియా శుక్రవారం తెలిపారు.
India Post New Innovation
తాము మెయిల్స్ , పార్శిల్‌ల హామీ డెలివరీతో కొత్త ఉత్పత్తులను ప్రారంభించ బోతున్నామని ప్రకటించారు. 24 గంటల్లోపు మెయిల్స్ డెలివరీని నిర్ధారించే 24 గంటల స్పీడ్ పోస్ట్ సర్వీస్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా 48 గంటల్లోపు డెలివరీ కోసం 48 గంటల స్పీడ్ పోస్ట్ ఉంటుందన్నారు. ఈ సేవలు జనవరిలో ప్రారంభించ బడతాయని ఆయన వెల్లడించారు. పార్శిల్‌లను మరుసటి రోజు డెలివరీ చేయడానికి కూడా ఇలాంటి సేవలు ఉంటాయని, ప్రస్తుతం దాదాపు 3-5 రోజుల తర్వాత పార్శిల్ డెలివరీ అయ్యేలా చూస్తామని ఆయన అన్నారు. 2029 నాటికి ఇండియా పోస్ట్‌ను ‘కాస్ట్ సెంటర్’ నుండి ‘లాభ కేంద్రం’గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి చెప్పారు.
Also Read : Amit Shah Challenge : బీహార్ లో మళ్లీ మాదే అధికారం : అమిత్ షా


















