Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మా ఉత్పత్తులపై 100 శాతం సుంకాన్ని అమలు చేయాలని ప్రకటించారు. ఈ సుంకాలు అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి రానుండగా, శుక్రవారం స్టాక్ మార్కెట్లు (Stock Market) ప్రారంభమైన వెంటనే ఫార్మా ఇండెక్స్ 2 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. దేశంలోని 119 ఫార్మాస్యూటికల్ కంపెనీలలో 112 షేర్లు క్షీణించాయి, ఫలితంగా ఫార్మా రంగం వాల్యుయేషన్ రూ.74,000 కోట్ల వరకు తగ్గింది. దివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ వంటి ప్రధాన కంపెనీలు గణనీయమైన క్షీణతను ఎదుర్కొన్నాయి.
Trump – ఫార్మా ఎగుమతులపై ప్రభావం
భారతదేశం ఫార్మా ఎగుమతుల పరంగా అమెరికాకు ప్రధాన మార్కెట్. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ ఎగుమతులు రికార్డు స్థాయిలో 30 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా మార్చిలో ఎగుమతులు 31 శాతం వృద్ధిని సాధించాయి. ఇతర దేశాలకు ఎగుమతులు కూడా 6.94 శాతం పెరిగి 2.51 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రధాన కంపెనీలు ప్రభావితమయ్యాయి
డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్, సన్ ఫార్మా, సిప్లా, గ్లెన్‌మార్క్ ఫార్మా వంటి ప్రధాన కంపెనీల మొత్తం ఆదాయంలో 30-50 శాతం అమెరికా మార్కెట్ నుండి వస్తుంది. బ్రాండెడ్ ఉత్పత్తులపై సుంకాలు అమలు కావడంతో, ఈ కంపెనీలకు ప్రత్యక్షంగా నష్టాలు కలిగే అవకాశం ఉంది. ఫలితంగా, శుక్రవారం ప్రధాన భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండింటిలోనూ తీవ్ర క్షీణత ఏర్పడింది.
మార్కెట్ నష్టం వివరాలు
దేశంలోని టాప్ 10 ఫార్మా కంపెనీల మార్కెట్ క్యాప్ కొన్ని వేల కోట్లు కోల్పోయినా, మొత్తం ఫార్మాస్యూటికల్ రంగం రూ.74,189.78 కోట్ల నష్టాన్ని చవిచూసింది. బిఎస్‌ఇ హెల్త్‌కేర్ ఇండెక్స్ గురువారం 29,51,033.05 కోట్ల నుంచి శుక్రవారం 28,76,843.27 కోట్లకు పడిపోయింది. 119 ఫార్మాస్యూటికల్ కంపెనీలలో 112 షేర్లు క్షీణించగా, 7 కంపెనీల షేర్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి.
ఈ నిర్ణయం భారత ఫార్మా రంగానికి గణనీయమైన సవాలు సృష్టించింది, భవిష్యత్తులో కంపెనీలు అమెరికా మార్కెట్‌లో తమ వ్యూహాలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉండే అవకాశం ఉంది.
Also Read : UPI, PAN, NPS – Important Update : అక్టోబర్ 1 నుంచి పాన్, యూపీఐ, ఎన్ పి ఎస్ లో కీలక మార్పులు
