స‌మిష్టిగా రాణించారు విశ్వ విజేత‌గా నిలిచారు

ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇండియా రికార్డ్ బ్రేక్

hellotelugu-TeamIndiaWi

అహ్మ‌దాబాద్ : 143 కోట్ల భార‌తీయులు గ‌ర్వ ప‌డేలా భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాళ్లు స‌త్తా చాటారు. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియంలో ల‌క్షా 30 వేల మంది ప్రేక్ష‌కుల సాక్షిగా విశ్వ విజేత‌లుగా నిలిచారు. ఇండియా, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హించిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను స‌మిష్టిగా రాణించి కైవ‌సం చేసుకున్నారు. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటారు. గతంలో ఉన్న రికార్డుల‌ను తిర‌గ రాశారు. సెంటిమెంట్ ను ప‌క్క‌న పెట్టారు. 2007లో మ‌హేంద్ర సింగ్ ధోనీ సార‌థ్యంలో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిస్తే , రోహిత్ శ‌ర్మ త‌ర్వాత సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని టీం ఇండియా వ‌రుస‌గా 2024, 2026ల‌లో గెలుపొంది అరుదైన ఘ‌న‌త‌ను సాధించారు.

భారత్ చరిత్రలో మూడుసార్లు T20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది . ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 255 ర‌న్స్ చేసింది. సంజు శాంస‌న్ 89 ర‌న్స్ చేస్తే అభిషేక్ శ‌ర్మ 52 ర‌న్స్ , ఇషాన్ కిష‌న్ 54 ప‌రుగులు చేస్తే , శివ‌మ్ దూబే 26 ర‌న్స్ తో శివాలెత్తి పోయాడు. ఆ త‌ర్వాత బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 19 ఓవ‌ర్ల‌లోనే 159 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. దీంతో 96 ప‌రుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది టీం ఇండియా.

Exit mobile version