టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇండియా, సౌతాఫ్రికా ఫైన‌ల్ ప‌క్కా

ద‌క్షిణాఫ్రికా ప్ర‌ధాన కోచ్ శుక్రి కాన్రాడ్ కామెంట్స్

hellotelugu-SouthAfricaHeadCoach

అహ్మ‌దాబాద్ : ఇండియా చేతిలో 5వ టి20 ఓట‌మి చెంద‌డం, సీరీస్ ను కోల్పోయినా తాము గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం జరిగింద‌న్నారు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు హెడ్ కోచ్ శుక్రి కాన్రాడ్. త‌ను మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా 2024లో జరిగిన గత ఎడిషన్‌లో ఉత్కంఠ భరితమైన ఫైనల్‌లో ప్రొటీస్‌ను ఓడించి, భారత్ టీ20 ప్రపంచ కప్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా అవ‌త‌రించింది. వ‌చ్చే ఏడాది 2026లో ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హించ‌నున్నాయి. ఇప్ప‌టికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు త‌మ ఫైన‌ల్ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి. శ‌నివారం కీల‌క తుది జ‌ట్టును ప్ర‌క‌టించ‌నుంది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ.

త‌మ జ‌ట్టు అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో రాణించింద‌ని అన్నాడు. కొన్ని పొర‌పాట్లు తాము ఓడి పోయేందుకు కార‌ణం అయ్యాయ‌ని చెప్పాడు కోచ్ శుక్రి కాన్రాడ్. ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ ఫిబ్ర‌వరి 7 నుండి మార్చి 8 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. మాకు ఇంకా స‌మ‌యం ఉంది. మేం త‌ప్ప‌కుండా ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ కు చేరుకుంటామ‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నాడు. తాము మ‌రోసారి భార‌త జ‌ట్టుతో త‌ల‌ప‌డాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పాడు. తాము బౌలింగ్ ఎంచు కోవ‌డం త‌ప్పేన‌ని ఒప్పుకున్నాడు. ప్రారంభం నుంచే శ‌ర్మ‌, శాంస‌న్ దాడి ప్రారంభించార‌ని, ఆ త‌ర్వాత సూర్య విఫ‌లం అయినా పాండ్యా, తిల‌క్ లు అద్బుతంగా ఆడారంటూ ప్ర‌శంసించారంటూ పేర్కొన్నాడు హెడ్ కోచ్.

Exit mobile version